background cover of music playing
Ye Manishike Majiliyo - Arun Gopan

Ye Manishike Majiliyo

Arun Gopan

00:00

04:05

Song Introduction

ఈ పాటకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం లేదు.

Similar recommendations

Lyric

ఏ మనిషి కేమజిలీయో

పైవాడు చూపిస్తాడు

నువు కోరుకుంటే మాత్రం

దొరికేది కాదంటాడు

నువ్వు నిజంలాగ నను ముడేస్తుంటే

ఈ నిమిషాన

నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా

నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంలా

నను చూస్తున్నా

నేను అదేపనిగ నిను వెలేస్తూనే ఉన్నా

నువ్వు నను కడలిలోని

ఆ కెరటమల్లె విడిపోకున్నా

నేను ఒక మనసులేని శిలలాగ మారినానా?

ఏ మనిషి కేమజిలీయో

పైవాడు చూపిస్తాడు

నువు కోరుకుంటే మాత్రం

దొరికేది కాదంటాడు

ఓ మదిని దూరం చేస్తే

ఇంకోటి ముడి వేస్తాడు

ఎదలోని ప్రేమను వేరే

మజిలీకి చేరుస్తాడు

నా నిన్నలోని ఆ గురుతులన్నీ

ఈ మనసులోంచి చెరిపేదెలాగ?

ఇన్నాళ్ళు నాలో కలిసున్న ప్రాణం

నే వేరుచేసి బ్రతికేదెలాగ?

ఈ వేషమే ఎన్నాళ్ళని

విధి ఆడుతుందా ఈ నాటకాన్ని?

నువ్వు నిజంలాగ నను ముడేస్తుంటే

ఈ నిమిషాన

నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా

నీ పిలుపు కోసం వెతికింది మౌనం

ఆ వరము కోరి మిగిలుంది ప్రాణం

నా గుండెనడుగు చెబుతుంది నీకే

ఈ ఊపిరుంది నీ చెలిమి కొరకే

నీ కోసమే వేచిందిలే

నువు సేద తీరే ఈ ప్రేమ మజిలీ

నేను నిజంలాగ నిను ముడేస్తుంటే

ఈ నిమిషాన

నువ్వు గతంలోని ఆ కలల్లోనే ఉన్నా

నేను ప్రతిసారి నా ప్రపంచంలా

నిను చూస్తున్నా

నువ్వు అదేపనిగ నను

వెలేస్తూనే ఉన్నా

నేను నిను కడలిలోని

ఆ కెరటమల్లె విడిపోకున్నా

నువ్వు ఒక మనసులేని శిలలాగ మారినావా?

ఏ మనిషి కేమజిలీయో

పైవాడు చూపిస్తాడు

నువు కోరుకుంటే మాత్రం

దొరికేది కాదంటాడు

ఓ మదిని దూరం చేస్తే

ఇంకోటి ముడి వేస్తాడు

ఎదలోని ప్రేమను వేరే

మజిలీకి చేరుస్తాడు

- It's already the end -