00:00
04:12
ప్రస్తుతం ఈ పాట గురించి సంబంధిత సమాచారం అందుబాటులో లేదు.
శౌరా అగనిత సేనా సమగం
భీరా వే ఖడ్గపు ధారా
రౌరా క్షతగాత్రా ఆభరణుడి
ఔరా పగతుర సంహారా
శిరసెత్తే శిఖరం నువ్వే
నిప్పులు గక్కే ఖడ్గం నీదే
కసి రెక్కల గుర్రం పైన
కదిలొచ్చే భూకంపం నువ్వే
నిన్నాపే వాడెవడైనా చెయ్యే వేస్తే
శవమై పోడా
లంగించే సింగము నువ్వే
సంగర భీకరుడా
భూతల్లి పై ఒట్టెయ్
భూతల్లి పై ఒట్టెయ్
తెలుగోడి వడి చూపెట్టెయ్
తెల్లోడి నెత్తురుతోనే
నీ కత్తికి పదును పట్టెయ్
భూతల్లి పై ఒట్టెయ్
తెలుగోడి వడి చూపెట్టెయ్
తెల్లోడి నెత్తురుతోనే
నీ కత్తికి పదును పట్టెయ్
శౌరా అగనిత సేనా సమగం
భీరా వే ఖడ్గపు ధారా
రౌరా క్షతగాత్రా ఆభరణుడి
ఔరా పగతుర సంహారా
♪
నల్లపూసలైనా చాలయ్య మెడకు
ఒల్లనింక నేను ఏ వెండి గొలుసు
రక్త తడి మెరిసే నీ బాకు మొనకు
ముద్దు తడి జత చైమంది మనసు
నీ పాద ధూళి మెరుపౌతను
నీ యుద్ధ కేళి మరకౌతను
నీ పట్టులోన మెలికౌతను
లేక ఈ మట్టిలోన మొలకౌతను
(గుడియా గుడియా)
(నీతో గడిపే ఘడియ కన్నే)
(సన్నజాజి మూకుడవనా)
(హోలియా హోలియా)
(ఆడ పులివే చెలియా నీలో)
(చారలెన్నో ఎన్నో చెప్పనా)
తుపాకి వణికే సీమ సిపాయి ముందు
సింహం నువ్వే
గుండెల్లో పెంచుకున్న
తల్లుల ముద్దు బిడ్డవు నువ్వే
తలవంచిన బానిస రక్తం
మరగ పెట్టే మంటవు నువ్వే
అధికార వర్గంపైన అనుకుశం నువ్వే
భూతల్లిపై ఒట్టెయ్
తెలుగోడి వడి చూపెట్టెయ్
తెల్లోడి నెత్తురుతోనే
నీ కత్తికి పదును పట్టెయ్
భూతల్లిపై ఒట్టెయ్
తెలుగోడి వడి చూపెట్టెయ్
తెల్లోడి నెత్తురుతోనే
నీ కత్తికి పదును పట్టెయ్
శౌరా అగనిత సేనా సమగం
భీరా వే ఖడ్గపు ధారా
రౌరా క్షతగాత్రా ఆభరణుడి
ఔరా పగతుర సంహారా