00:00
03:43
ప్రస్తుతానికి ఈ పాట గురించి సంబంధిత సమాచారం లభించలేదు.
ఓహో హో ఓహో హో
నీ చూపే చల్లని చిరుగాలై
మనసునే తాకెనే
నీ శ్వాసే వెచ్చని చలి మంటై
దూరమే కాలెనే
కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే
నాలో ఏదో ఆశ రేగిందే
చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని
మది నీతో పాటు ఎగిరిందే
హుళాల ల ల నీతో హుళల
నీ వల్లే హే హే గాల్లో తేలేలా
హుళాల ల ల నీతో హుళల
నీ వల్లే ఈ హాయి హుళాలా
♪
తెలిసి తెలిసి వెన్నెలంటి
నిన్నెలా ఎండకి వేశా
దూరమేసి ద్వేషమేసి
నిన్నెలా నే మరిచానే
కలవని పదం కలిసింది మనసా
ముగియని కథై నిను చేరు వరసా
ఊపిరి సగం నీకోసమేగా
నీలోని సంతోషం నాలో సంగీతం
హుళాల ల ల నీతోనే హుళల
నీ వల్లే ఏ ఏ మేఘాల్లో తేలేలా
హుళాల ల ల నే నీతో హుళల
నీ వల్లే ఈ హాయే హుళాలా
♪
ఓహో మామ మియా ఓహో మామ మియా
ఓహో మామ మియా ఏ ఏ ఏ
ఓహో మామ మియా ఓహో మామ మియా
ఓహో మామ మియా ఏ ఏ ఏ
కలల కాఫీ సొంత selfy
రంగులా जिंदगी నువ్వే
నాకు తెలిసి నన్ను కోరే
ఆడపిల్లవు నువ్వేలే
కలిసిన రోజే ఊహించి ఉంటే
కలవని రోజే ఉండేది కాదే
కలలకు ఇక ప్రతి రోజు సెలవే
నీడల్లే ప్రేమల్లే నాతో నువ్వుంటే
ఓ హుళాల ల ల నీతో హుళల
నీవల్లే హే హే గాల్లో తేలేలా
హుళాల ల ల నీతో హుళల
నీవల్లే ఈ హాయే హుళాలా