00:00
03:48
ప్రస్తుతానికి ఈ పాట గురించి సంబంధిత సమాచారం అందుబాటులో లేదు.
మనసు పలికే భాష ప్రేమ
మౌనమడిగే బదులు ప్రేమ
మరణమైనా తోడు ప్రేమ
మనకి జరిగే మాయ ప్రేమ
మనకి జరిగే మాయ ప్రేమ
♪
గుండెలో వ్యథలనే కాల్చు మంటే ప్రేమ
రగిలిన సెగలనే ఆర్పునది ప్రేమ
ఆదియూ అంతమూ లేని పయనం ప్రేమ
వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ
విశ్వమంతా ఉన్న ప్రేమ, ఇరుకు ఎదలో దాచగలమా?
♪
కాటిలో కాలదు తుదిలేని ఈ ప్రేమ
జన్మనే కోరదు అమ్మెరుగదీ ప్రేమ
దొరకదా వెతికితే కడలైనా కన్నీట
తరమగా దాహమే నీరల్లే ఓ ప్రేమా
నీడనిచ్చే వెలుగుతోడు చీకటైతే ఏమికాను?