00:00
03:36
ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన సమాచారం లభించలేదు.
కళ్లలో దాగి ఉన్న
కలలు ఓ అద్భుతం
నా కలలనే నిజము చేసే
నువ్వు ఓ అద్భుతం
పరిపరి తలిచేలా
నీ పరిచయం అద్భుతం
పడిపడి చదివేలా నీ మనసు
నా పుస్తకం
పదహారు ప్రాయంలోన పరువాల ప్రణయంలోన
హృదయాలను కలిపేసే పండగే అద్భుతం
ఇలా మనకంటూ ఒకరుంటే
ప్రతి పయనం రంగులమయమే
ఇలా నా వెంట నువ్వుంటే
జీవితమే ఓ అద్భుతమే
ఇలా మనకంటూ ఒకరుంటే
ప్రతి పయనం రంగుల మయమే
ఇలా నా వెంట నువ్వుంటే
జీవితమే ఓ అద్భుతమే
♪
కిరణం తోరణంలా సిరులే
కురియు వేళ
తలపే వామనంలా వలపే
గెలుచు వేళ
ప్రియుడిని చూసి ప్రేయసి పూసే
బుగ్గన సిగ్గే ఎంతో అద్భుతం
ఆరారు రుతువులు అన్నీ
తమ ఇల్లే ఎక్కడ అంటే
మన అడుగుల్ని చూపే
సంబరం అద్భుతం
ఏవేవో సంగీతాలు ఎన్నెన్నో సంతోషాలు
మన గురుతులుగా మిగిలే
ఈ వేడుకే అద్భుతం
ఇలా మనకంటూ ఒకరుంటే
ప్రతి పయనం రంగులమయమే
ఇలా నా వెంట నువ్వుంటే
జీవితమే ఓ అద్భుతమే
ఇలా మనకంటూ ఒకరుంటే
ప్రతి పయనం రంగులమయమే
ఇలా నా వెంట నువ్వుంటే
జీవితమే ఓ అద్భుతమే