00:00
04:07
Rock on bro అంది సెలవు రోజు
గడిపేద్దాం life king size
ఒకే గదిలో ఉక్కపోత చాలు
గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు
ఏ దిక్కులో ఏమున్నదో
వేటాడి పోగు చేసుకుందాం ఖుషీ
మన్నాటలో చంటోడిలా
ఆహా అనాలి నేడు మనలో మనిషి
మనసిపుడు మబ్బులో విమానం
నేలైనా నింగితో సమానం
మత్తుల్లో ఇదో కొత్త కోణం
కొత్త ఎత్తుల్లో ఎగురుతుంది ప్రాణం
ఆనందమో ఆశ్చర్యమో
ఏదోటి పొందలేని సమయం వృధా
ఉత్తేజమో ఉల్లాసమో
ఇవాల్టి నవ్వు రంగు వేరే కదా
మనమంతా jeans pant రుషులు
Backpack లో బరువు లేదు అసలు
వినలేదా మొదటి మనిషి కథలు
అలా బతికేద్దాం ఓ నిండు రేయి పగలు
ఇదీ మనం ఇదే మనం
క్షణాల్ని జీవితంగా మార్చే గుణం
ఇదే ధనం ఈ ఇంధనం
రానున్న రేపు వైపు నడిపే బలం