00:00
05:09
గిరినీ మే గలగాల గిర తీతి బైమారె
బియ్యాన దెకదెకో జురతీతి బైమా
అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే
పై నుంచి ఈ వాన ఇట్టా దూకేనా
చాల్లే అని ఎవరైనా ఆపుంటే ఎపుడైనా
సయ్యాట సాగేనా ఎగసే కెరటానా
అమ్మా నాన్నా ఉంటే
అమ్మో అమ్మో ఇబ్బందే
కాస్తయినా అల్లరి చేసే వీల్లేదే
అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే
పై నుంచి ఈ వాన ఇట్టా దూకేనా
♪
సూరీడుకి నాన్నుంటే schoolలో పెడతానంటే
పగలైనా వెలుతురు వస్తుందా ఆ
జాబిల్లికి అమ్ముంటే ఒళ్ళో జోకొడుతుంటే
రాతిరేళ వెన్నెల కాస్తుందా
నిను చేరేనా నా లాలనా
ఏనాటికైనా ఓ పసికూనా
ఆడిందే ఆటంట
పాడిందే పాటంట
ఆపేందుకు అమ్మా నాన్నా లేరంట
సరదాగా రోజంతా తిరగేనా ఊరంతా
ఊరేగే చిరుగాలికి ఉండుంటే అమ్మా
అలుపంటూ లేకుండా చెలరేగి ఉరికేనా
ఉప్పొంగే సెలయేటికి ఉండుంటే నాన్నా
♪
అలిగిందా రా చిలకా కూర్చుందా కిమ్మనక
నాతో మాటాడేదెవరింకా ఆ
రానందా నా వంక దాగుందా కొమ్మెనకా
అమ్మో మరి నాకేం దారింకా
ఏది ఏది రానీ రానీ
నన్నేరుకోనీ ముత్యాలన్నీ
నీ నవ్వే చాలంటా
పులకించే నేలంతా
పున్నాగ పువ్వుల తోటయ్యేనంట
గిరినీ మే గలగాల గిర తీతి బైమారె
బియ్యాన దెకదేకో జురతీతి బైమా
జగడోబ సూడాల పలుమారు చూడాలి
సరిపోలా జడివాన ఉబికే ఈ గాలి
దిక్కుల్నే దాటాలి చుక్కల్నే తాకాలి
ఆనందం అంచుల నేడే చూడాలి
గిరినీ మే గలగాల గిర తీతి బైమారె
బియ్యాన దెకదేకో జురతీతి బైమా
జగడోబ సూడాల పలుమారు చూడాలి
సరిపోలా జడివాన ఉబికే ఈ గాలి