00:00
02:40
పద పదమన్నది నా అడుగే నీ వైపు
అటు ఇటు చూడకు అంటోందే నా చూపు
నా మది కూడా ఎపుడో జారిందే
అది ప్రేమో ఏమో తెలిసేలోపు
నే పడిపోయా పడిపోయా పడిపోయా పడిపోయా
నిలువెల్లా నీతోనే ముడిపడిపోయా
నే చెడిపోయా చెడిపోయా చెడిపోయా చెడిపోయా
తరిమే నీ ఊహాలతో మతి చెడి పోయా
పద పదమన్నది నా అడుగే నీ వైపు
అటు ఇటు చూడకు అంటోందే నా చూపు
నా గతము చెరిపి, నిజము తెలిపి
పోల్చనంతగా నన్నే
అణువణువు మార్చెను నీ ప్రణయం
ఈ కరుకు మనసు కరిగి కరిగి
రేయి పగలు నా కలలను
నీ తలపుతొ ముంచినది సమయం
నీ ప్రేమే నీ ప్రేమే
ఓ వరమల్లే గుండెల్లోన కొలువు తీరదా
నా ప్రేమే నా ప్రేమే
నను గెలిపించి నిను నాతో నడిపిస్తుందా
పద పదమన్నది నా అడుగే నీ వైపు
అటు ఇటు చూడకు అంటోందే నా చూపు
నా మది కూడా ఎపుడో జారిందే
అది ప్రేమో ఏమో తెలిసేలోపు
నే పడిపోయా పడిపోయా పడిపోయా పడిపోయా
నీతోనే ఈ నిమిషం ముడిపడిపోయా
నే చెడిపోయా చెడిపోయా చెడిపోయా చెడిపోయా
ప్రేమించే నీ కొరకే మతి చెడి పోయా