00:00
05:48
బోలో రామ భక్త హనుమానుకి జై
ఓం మన్ మన్ మన్ మారుత వేగా
ఓం తస్ తస్ తస్ తాపశ యోగా
ఓం ఓం వానర నేత
ఓం నమోనమ భావి విధాత
రామ లక్ష్మణ జానకి
జయము జయము హనుమానుకి
భయము భయము రానంతకీ
జయ జయము అనరా హనుమానుకి
చింత తీర్చెరా సీతకి
జయ జయ జయ హనుమానుకి
♪
ఊరేగి రావయ్యా హనుమా
జై హనుమా
ఊరేలి చూపించు మహిమ
మా తోడు నీవయ్యా హనుమా
మా హనుమా
మా గోడు గోరంత వినుమా
వాయుపుత్రా హనుమా
మావాడవయ్యా హనుమా
రామ భక్త హనుమా
మా రక్ష నీవే వినుమా
మమ్ము ఆదుకోరావయ్యా
ఆంజనేయా ఆపదకాయ
చూపించరా దయ
మమ్ము ఏలుకో రావయ్యా
రాక్షసమాయ హతమే చేయ
నీ నీడ చాలునయా
వాయుపుత్రా హనుమా
మావాడకొచ్చే హనుమా
రామ భక్త హనుమా
మా రక్ష నీవే హనుమా
మమ్ము ఆదుకోరావయ్యా
ఆంజనేయా ఆపదకాయ
చూపించరా దయ
మమ్ము ఏలుకో రావయ్యా
రాక్షసమాయ హతమే చేయ
నీ నీడ చాలునయ
♪
జై భజరంగబలి
ఓం మన్ మన్ మన్ మారుత వేగా
ఓం తస్ తస్ తస్ తాపశ యోగా
ఓం ఓం వానర నేత
ఓం నమోనమ భావి విధాత
ఓం హనుమ ఓం రామ భజంత
ఓం కపిరాజ్య రాక్షస తంతా
తకిడ థకధిమిథ జై హనుమంతా
ఆర్త ద్రాణక రా భగవంతా
బంటువైనా నువ్వేలే
బంధువైనా నువ్వేలే
బాధలన్నీ తీర్చే
దిక్కూ దైవం నీవేలే
చూసి రారా అంటేనే
కాల్చి వచ్చావ్ మంటల్లే
జానకమ్మ కంట వెలిగే
హారతీ నీవే
ఎదలోనే శ్రీరాముడంట
కనులారా కనమంట
బ్రహ్మచారి మా బ్రహ్మవంట
సరిసాటి ఎవరంట
సాహొ మా సామీ
నువ్వే హామీ ఇస్తూంటే
రామబాణాలు కాపాడేనంట
ఓహొ మా జండాపైన
అండై నువ్వుంటే
రామరాజ్యాలు మావేలెమ్మంట
మమ్ము ఆదుకోరావయ్యా
ఆంజనేయా ఆపదకాయ
చూపించరా దయ
మమ్ము ఏలుకో రావయ్యా
రాక్షసమాయ హతమే చేయ
నీ నీడ చాలునయా
♪
మండుతున్న సూర్యుణ్ణి
పండులాగా మింగావు
లక్ష్మణుణ్ణి కాచే చెయ్యే సంజీవి మాకు
తోక చిచ్చు వెలిగించి
లంక గుట్టే రగిలించి
రావణుణ్ణి శిక్షించావు నువ్వే మా తోడు
శివతేజం నీ రూపమంట
పవమాన సుతుడంట
అంజనమ్మ ఆనందమంతా
హనుమా నీ చరితంట
పాహీ శ్రీరామస్వామీ పల్లకి నువ్వంట
నీకు బోయీలు మేమేలెమ్మంట
యాహీ ఆకాశాలైనా చాలని ఎత్తంట
కోటి చుక్కల్లు తల్లో పూలంటా
మమ్ము ఆదుకోరావయ్యా
ఆంజనేయా ఆపదకాయ
చూపించరా దయ
మమ్ము ఏలుకో రావయ్యా
రాక్షసమాయ హతమే చేయ
నీ నీడ చాలునయా
వాయుపుత్రా హనుమా
మా వాడవయ్యా హనుమా
రామభక్త హనుమా
మా రక్ష నీవే వినుమా
మమ్ము ఆదుకోరావయ్యా
ఆంజనేయా ఆపదకాయ
చూపించరా దయ
మమ్ము ఏలుకో రావయ్యా
రాక్షసమాయ హతమే చేయ
నీ నీడ చాలునయా