00:00
04:18
ప్రస్తుతం ఈ పాటకు సంబంధించి సమాచారం లభించలేదు
గాలి వాలుగా ఓ గులాబి వాలి
గాయమైనదీ నా గుండెకి తగిలి
తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా చెలీ ఇలా దొరికితె
నీ స్నేహం
ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి
తేనె జడిలో ముంచేసావే
గాలులకు గంధం రాసి
పైకి విసురుతావే
ఏం చేస్తావే మెరుపు చురకత్తుల్నే దూసి
పడుచు యెదలో దించేసావే
తలపునే తునకలు చేసి
తపన పెంచుతావే
నడిచే హరివిల్లా నను నువ్విల్లా
గురి పెడుతుంటే ఎలా
అణువణువున విలవిల మనదా
ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలు నిలబడు
పిల్లా గాలిపటంలా ఎగరకె అల్లా
సుకుమారి సొగసునలా ఒంటరిగా ఒదలాలా
చూస్తేనే గాలి వాలుగా ఓ గులాబి వాలి
గాయమైనదీ నా గుండెకి తగిలి
తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా చెలీ ఇలా దొరికితె
నీ స్నేహం
♪
కొరా కొరా కోపమేలా
చురా చురా చూపులేలా
మనోహరి మాడిపోనా అంత ఉడికిస్తే
అరె అని జాలిపడవేం
పాపం కదే ప్రేయసి
సరే అని చల్లబడవేం
ఓసి పిసాచి
ఉహూ అలా తిప్పుకుంటూ
తూలిపోకే ఊర్వశి
అహొ అలా నవ్వుతావే
మీసం మెలేసి
ఎన్నాళ్లింకా ఊరికే ఊహల్లో ఉంటాం
పెంకి పిల్లా
చాల్లే ఇంకా మానుకో
ముందూ వెనక చూసుకోని పంతం
ఆలోచిద్దాం చక్కగా కూర్చొని
చర్చిద్దాం చాలు యుద్ధం
రాజీకొద్దాం కొద్దిగా కలిసొస్తే
నీకేమిటంట కష్టం
నడిచే హరివిల్లా నను నువ్విల్లా
గురి పెడుతుంటే ఎలా
అణువణువున విలవిల మనదా
ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలు నిలబడు
పిల్లా గాలిపటంలా ఎగరకె అల్లా
సుకుమారి సొగసునలా ఒంటరిగా ఒదలాలా
ఏం చేయాలోలే గాలివాలుగా
ఓ గులాబి వాలి
గాయమైనదీ నా గుండెకి తగిలి
తపించిపోనా ప్రతీక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా చెలీ ఇలా దొరికితె
నీ స్నేహం