00:00
03:32
చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక
వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా
చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక
ఏం చేస్తున్నా నా ధ్యాసంతా నీ మీదే తెలుసా
నిను చూడనిదే ఆగననే
ఊహల ఉబలాటం ఉసి కొడుతుంటే
వస్తున్నా వచ్చేస్తున్నా ఆ... ఆ
వద్దన్నా వదిలేస్తానా ఆ... ఆ
కవ్విస్తూ కనపడకున్నా ఆ... ఆ
ఉవ్వెత్తున ఉరికొస్తున్నా ఆ... ఆ
చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక
వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా
♪
చెలియా చెలియా నీ తలపే తరిమిందే
అడుగే అలలయ్యే ఆరాటమే పెంచగా
ఘడియో క్షణమో ఈ దూరం కరగాలే
ప్రాణం బాణంలా విరహాన్ని వేటాడగా
మురిపించే ముస్తాబై ఉన్నా
దరికొస్తే అందిస్తాగా ఆనందంగా
ఇప్పటి ఈ ఒప్పందాలే ఆ... ఆ
ఇబ్బందులు తప్పించాలే ఆ... ఆ
చీకటితో చెప్పించాలే ఆ... ఆ
ఏకాంతం ఇప్పించాలే ఆ... ఆ