00:00
05:55
నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా
దీన్నే తొలిప్రేమ అంటారే మైనా
ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా
చాల్లే ఇట్టాంటివి చాలానే విన్నా
అంటే అన్నానంటూ కోపాలేనా
నువ్వే చెప్పు నే తప్పన్నానా
పోన్లే నీకేంటంటా నాకేమైనా
ఏదో సాయం నిన్నిమ్మన్నానా
వలపంటే నిప్పులాంటిది
కలకాలం దాచలేనిది
సలహా విని ఒప్పుకోవే ఇకనైనా
హా' సర్లే ఈ ప్రేమ సంగతి
నాలాగే నీకు కొత్తది
ఐనా మరి ముందు నీకే తెలిసేనా
♪
ప్రతిరోజూ నడిరాతిర్లో చేస్తావా స్నానాలు
వొళ్ళంతా చెమటలు పడితే తప్పవుగా చన్నీళ్ళు
వణికించే చలికాలంలో ఏమా ఆ ఆవిర్లు
ఉడికించే ఆలోచనలు పుడుతున్నవి కాబోలు
ఇంతిదిగా వేడెక్కే ఊహలు రేపిందెవరు
నీలా నను వేధించే దుష్టులు ఎవరుంటారు
అదిగో ఆ ఉలుకే చెబుతోంది నువు దాచాలనుకున్నా
దీన్నే Loveలో పడిపోడం అంటున్నా
చాల్లే ఇట్టాంటివి చాలానే విన్నా
♪
ఒంట్లో బాగుంటంలేదా ఈ మధ్యన నీకసలు
నాకేం ఎంచక్కా ఉన్నా నీకెందుకు ఈ దిగులు
Yo, this is what is love
It's a really tough feeling
You got this up the heart
So that, bump it to the ceiling
All you gotta to do is
Talk well, walk well, move well and groove well
అంతా సరిగానే ఉంటే ఎరుపెక్కాయేం కళ్ళు
వెంటాడే కలలొస్తుంటే నిదరుండదు తెల్లార్లూ
ఐతే మరి నువ్వెపుడూ కనలేదా ఏ కలలూ
నా కలలో ఏనాడూ నువు రాలేదిన్నాళ్ళూ
అదిగో ఆ మాటే నీ నోటే చెప్పించాలనుకున్నా
దీన్నే Loveలో పడిపోడం అంటున్నా
హ్మ్' అవునా ఏమో నే కాదనలేకున్నా
♪
నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా
దీన్నే తొలిప్రేమ అంటారే మైనా
నాలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా
దీన్నే తొలిప్రేమ అంటారో ఏమో
అంటే అన్నానంటూ కోపాలేనా
నువ్వే చెప్పూ నే తప్పన్నానా
పోన్లే నీకేంటంటా నాకేమైనా
ఏదో సాయం నిన్నిమ్మన్నానా
వలపంటే నిప్పులాంటిది
కలకాలం దాచలేనిది
సలహా విని ఒప్పుకోవే ఇకనైనా
హా' సర్లే ఈ ప్రేమ సంగతి
నాలాగే నీకు కొత్తది
ఐనా మరి ముందు నీకే తెలిసేనా