00:00
03:15
ఆకట్టుకుంది సంద్రం (దేవా)
బగ్గున మండే ఆకశం
ఆరాచకాల భగ్నం (దేవా)
చల్లారే చెడు సావసం
జగడపు దారిలో ముందడుగైన సేనాని
జడుపును నేర్పగా
అదుపున ఆపే సైన్యాన్ని
దూకే దైర్యమా జాగ్రత్త
(రాకే తెగబడి రాకే)
దేవర ముంగిట నువ్వెంత (దాక్కోవే)
కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయి కలుగుల్లో దూరేలే
దూకే దైర్యమ జాగ్రత్త
(పోవే పో ఎటుకైనా)
దేవర ముంగిట నువ్వెంత
(పొవెందుకే) దేవర
♪
జగతికి చేటు చేయనేలా
దేవర వేటుకందనేల
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ
కనులకు కానరాని లీల
కడలికి కాపైయ్యిందీ వేళ
విధికే ఎదురై వెళితే విల విలా
అల లయే ఎరుపు నీళ్లే
ఆ కాళ్లను కడిగెరా
ప్రళయమై అతడి రాకే
దడ దడ దడ దండోరా
దేవర మోనమే
సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చెమట
దూకే దైర్యమ జాగ్రత్త
(రాకే తెగబడి రాకే)
దేవర ముంగిట నువ్వెంత (దాక్కోవే)
కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయి కలుగుల్లో దూరేలే
దూకే దైర్యమ జాగ్రత్త
(పోవే పో ఎటుకైనా)
దేవర ముంగిట నువ్వెంత
(పొవెందుకే) దేవర