background cover of music playing
Manasuna Unnadi-Male - S. P. Balasubrahmanyam

Manasuna Unnadi-Male

S. P. Balasubrahmanyam

00:00

05:06

Similar recommendations

Lyric

మనసున ఉన్నది చెప్పేది కాదని మాటున దాచేదెల

మనదనుకున్నది చేజరిందని నమ్మకపోతే ఎలా

మరి మరి తలచి ఊహలలోనే దాచి చాటుగా చూసేదెల

తగదని తెలిసి తలపే ఆపలేని తప్పును చేసేదెలా

ఇకనైనా చెరగాలి నల్లని నీడల

నను వెంటాడే కల

మనసున వున్నది చెప్పేది కాదని మాటున దాచేదెల

నేల కందించి ఆకాశ గంగని

నింగి గుండెల్లో నలుపు కడగని

కురిసే చల్లని వాన జల్లుతో

కళ్ల ముందున్న సత్యాన్ని చూపని

రెప్ప చాటున్న నిదుర కరగని

ఊబికే వెచ్చని కన్నీళ్ళతో

అందిస్తున్న నా ప్రియమైన నీకు

అక్షింతలుగా నా ప్రతి ఆశనే

కలకాలం నీ నవ్వే నిను నడిపించని

నను వెంటాడే కల

మనసున వున్నది చెప్పేది కాదని మాటున దాచేదెల

నన్ను రమ్మన్నా చెలిమి వెన్నెల

దాటి రానంది చీకటి కాపలా

ఇకపై తెరలను తీసేదెల

నిన్ను నిన్నల్లో ఆపిన నిజమిల

జ్ఞాపకాలతో అల్లింది సంకెల

గతమే సిలువగ మోసేదెల

ఇచ్చేస్తున్నా నా ప్రియమైన నీకు

నీకై వెతికినా నా ప్రతి శ్వాసనే

నిను చేరి సిగా పూవై కొలువై ఉండని

నను వెంటాడే కల

మనసున వున్నది చెప్పేది కాదని మాటున దాచేదెల

మనదనుకున్నది చేజరిందని నమ్మకపోతే ఎలా

మరి మరి తలచి ఊహాలలోనే దాచి చాటుగా చూసేదెల

తగదని తెలిసి తలపే ఆపలేని తప్పును చేసేదెలా

ఇకనైనా చెరగాలి నల్లని నీడల

నను వెంటాడే కల

- It's already the end -