background cover of music playing
Sainika - Vishal Dadlani

Sainika

Vishal Dadlani

00:00

04:20

Similar recommendations

Lyric

సరిహద్దునా నువ్వు లేకుంటే

ఏ కన్ను పాప కంటి నిండుగా

నిదరపోదురా (నిదరపోదురా)

నిదరపోదురా (నిదరపోదురా)

నిలువెత్తున నిప్పు కంచేవై

నువ్వుంటేనే జాతి బావుటా

ఎగురుతుందిరా (ఎగురుతుందిరా)

పైకెగురుతుందిరా (పైకెగురుతుందిరా)

ఇల్లే ఇండియా ధిల్లె ఇండియా నీ తల్లే ఇండియా

తన భరోసా నువ్వే దేశం కొడకా

సెలవే లేని సేవాకా ఓ సైనికా

పనిలో పరుగే తీరికా ఓ సైనికా

ప్రాణం అంత తేలికా ఓ సైనికా

పోరాటం నీకో వేడుకా ఓ సైనికా

దేహంతో వెళిపోదీ కథ

దేశంలా మిగిలుంటుందిగా

సమరం ఒడిలో నీ మరణం

సమయం తలచే సంస్మరణం

చరితగా చదివే తరములకు

నువ్వో స్ఫూర్తి సంతకం

పస్తులు లెక్కపెట్టవే ఓ సైనికా

పుస్తెలు లక్ష్యపెట్టవే ఓ సైనికా

గస్తీ దుస్తుల సాక్షిగా ఓ సైనికా

ప్రతి పూటా నీకో పుట్టుకే ఓ సైనికా

బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు

ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు

తెగవాగు ధీరుడివనీ బలమగు భక్తుడనే

వేలెత్తి ఎలుగెత్తి భూమి పిల్చింది నీ శక్తిని నమ్మి

ఇల్లే ఇండియా, ధిల్లె ఇండియా

ఇల్లే ఇండియా ధిల్లె ఇండియా నీ తల్లే ఇండియా

తన భరోసా నువ్వే దేశం కొడకా

నువ్వో మండే భాస్వరం ఓ సైనికా

జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనికా

బతుకే వందేమాతరం ఓ సైనికా

నీ వల్లే ఉన్నాం అందరం ఓ సైనికా

- It's already the end -