00:00
04:57
కలయా నిజమా
తొలిరేయి హాయి మహిమా
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమా
అలవాటు లేని సుఖమా
ఇక నిన్ను ఆపతరమా
అణిగున్న ఆడతనమా
ఇకనైన మేలుకొనుమా
కలయా నిజమా
తొలిరేయి హాయి మహిమా
కలయా నిజమా
♪
లేనిపోని ఏ కూనిరాగమో లేచి రా అంటున్నదీ
ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవా అంటున్నదీ
కోకముళ్ల కూపీ తీసే కైపు చూపు కొరుకుతున్నదీ
కుర్రకళ్లు చీరగళ్లలో దారే లేక తిరుగుతున్నవీ
ముంచే మైకమే మురిపించే మొహమో
కలయా నిజమా
తొలిరేయి హాయి మహిమా
కలయా నిజమా
♪
చేయి వేయనా సేవ చెయ్యనా, ఓయ్ అనే వయ్యారమా
పాలముంచిన నీటముంచిన నీ దయే శృంగారమా
ఆగలేని ఆకలేవిటో
పైకి పైకి దూకుతున్నవి
కాలు నేల నిలవకుంటది ఆకాశాన తేలుతున్నదీ
అంతా మాయగా అనిపించే కాలము
కలయా
నిజమా
తొలిరేయి హాయి మహిమా
కలయా
నిజమా
తొలిరేయి హాయి మహిమా
అలవాటు లేని సుఖమా
ఇక నిన్ను ఆపతరమా
అణిగున్న ఆడతనమా
ఇకనైన మేలుకొనుమా
కలయా
నిజమా
తొలిరేయి హాయి మహిమా