background cover of music playing
Oo Aadapilla (From "Ashoka Vanamlo Arjuna Kalyanam") - Jay Krish

Oo Aadapilla (From "Ashoka Vanamlo Arjuna Kalyanam")

Jay Krish

00:00

04:57

Similar recommendations

Lyric

మాటరాని మాయవా

మాయజేయు మాటవా

మాటులోని మల్లెవా

మల్లెమాటు ముల్లువా

వయ్యారివా కయ్యారివా

సింగారివా సింగానివా

రాయంచవా రాకాసివా

లేమంచులో లావా నీవా

ఓ ఆడపిల్లా నువ్వర్థంగావా

నా జీవితంతో ఆటాడుతావా

ఓ ఆడపిల్లా నువ్వర్థంగావా

నా జీవితంతో ఆటాడుతావా

బుజ్జి బుజ్జి బుగ్గల్లోన ఎరుపుని

కనుల పులిమావా

చిట్టి చిట్టి చెక్కిళ్ళలో నునుపుని

నుదుటికియ్యలేవా

ఓ ఆడపిల్లా నువ్వర్థంగావా

నా జీవితంతో ఆటాడుతావా

పదిమంది చూస్తూ ఉంటే

అడ్డడ్డే అమాయకంగా

ఒక్కరైనా లేకపోతే

అయ్యయ్యో మరోరకంగా

ఉంటూ నా ఎదనే

తింటూ ఈ కథనే

సందేహంలో పడదొయ్యకే

ఏంటో నీ ఇబ్బంది చెప్పెయ్ ఏమౌతోంది

అట్టా అట్టా ఎళ్ళిపోకే

తిక్కో టెక్కో చిక్కో చుక్కో

అసలేదో ఒలిచి చెబుతావా

పట్టో బెట్టో గుట్టో కట్టో

నిజమేదో చెవిన పడనీవా

ఓ ఆడపిల్లా నువ్వర్థంగావా

నీతోటి స్నేహం సచ్చేటిసావా

బతిమాలడానికైనా ఇదిగో తయారుగున్నా

బదులియ్యి నేటికైనా

బతికి ఏదో విధాన

తాకే ఆ తెరపై

దూకే ఓ మెరుపై

నాకై నవ్వే విసిరావే

తీరా నీ ముందుంటే

తీరేలా పొమ్మంటూ

తీరం దాచి తిరిగావే

తప్పో ఒప్పో గొప్పో ముప్పో

తెలుపక లొసుగులెడతావా

మంచో చెడ్డో కచ్చో పిచ్చో

తెలియక నసిగి నడిచేవా

ఓ ఆడపిల్లా నువ్వర్థంకావా

సంద్రాలనైనా ముంచేటినావా

- It's already the end -