00:00
04:34
ఆట పాటలాడు నలుగురిలో
మాటలాడు చూడు మనసులతో
చెలిమల్లుకొని మనుషులతో
దారి పొడుగు పయనంలో
దారి చూపిన నడకలతో
ఆడి పాడి ఆడి పాడే
ఈ క్షణమన్నది నిజమే అయితే
చూడని రేపుని ఇప్పుడే కనమా
అలవాటైతే ఈ ఉత్సవమే
మది మరి మరి కోరదా మరల మరల
♪
చూసినదేదైనా చూడనివేవైనా
చూపుకి దొరికినదే కనువిందవదా
ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా
విన్నది ఏదైనా పది పది అవదా
తెలుపుతోనీ నేను నా సంగతులేవో
తెలుసుకొని నేను నీ గుసగుసలేదో
అడగమని తెలుపమని
మనలో మనకే మనతో మనమై
ఈ క్షణమన్నది నిజమే అయితే
చూడని రేపుని ఇప్పుడే కనమా
అలవాటైతే ఈ ఉత్సవమే
మది మరి మరి కోరదా మరల మరల
♪
ఉన్నది ఏదైనా ఉండేదేదైనా
ఉండటమొకటేలే అద్భుతమవదా
దూరం ఎంతున్నా చేరేదెప్పుడైనా
మనమై నడిచినదే సగమై అవదా
కళ్ళలోనే దాగిన కళలను యేవో
మనసు దాటి రానానే కధలను యేవో
చూపమని చెప్పమని
మనలో మనకే మనతో మనమై
ఈ క్షణమన్నది నిజమే అయితే
చూడని రేపుని ఇప్పుడే కనమా
అలవాటైతే ఈ ఉత్సవమే
మది మరి మరి కోరదా మరల మరల