00:00
03:50
ఈ పాట గురించి ప్రస్తుతం సమాచారం లభ్యం కాలేదు.
నీతో ఉంటా నీతో ఉంటా
నాలోన నిన్ను దాచుకుంటా
నీతో ఉంటా నీతోనే ఉంటా
నీలోని మౌనాలన్నీ వింటా
నువ్వుంటే చాలు దరిదాపుకి
రావే ఏ కన్నీళ్ళు
నువ్వుంటే చాలు చిరునవ్వుల కిరణాలు
నువ్వుంటే చాలు నీవెంటే
రావా నా పాదాలు
నువ్వుంటే చాలు నీపైనే
వాలే నా ప్రాణాలు
చుట్టూరా చీకటిని చిత్రంగా చెరిపావే
దారంతా వెన్నెల ధారే కురిపించావే
మనసారా ప్రేమించే మనసొకటి తోడుంటే
ప్రతి నిముషం పండగలే
అని చూపించావే
♪
ఏడేడు జన్మలకి కావాలి నువ్వు
నన్నొదిలి వెళ్లనని ఓ మాట ఇవ్వు
వదిలేదే లేదింక ఊపిరి వదిలేదాక
ఒట్టేసి చెబుతొంది నా చేతుల్లో రేఖ
ప్రేమలో కొత్త కోణం చూస్తున్నా
నాలోని కలలన్నీ నీ కన్నులతో చూసాలే
వేవేల వర్ణాల్లోనా వాటిని ముంచావే
నాకింకో పుట్టుకిది అనిపించేలా చేసావే
నన్నింకో లోకంలోకి రప్పించావే
చుట్టూరా చీకటిని చిత్రంగా చెరిపావే
దారంతా వెన్నెల ధారే కురిపించావే
మనసారా ప్రేమించే మనసొకటి తోడుంటే
ప్రతి నిముషం పండగలే
అని చూపించావే