background cover of music playing
Kalyanam Vybhogam - Mickey J. Meyer

Kalyanam Vybhogam

Mickey J. Meyer

00:00

03:56

Similar recommendations

Lyric

కళ్యాణం వైభోగం

ఆనంద రాగాల శుభయోగం

కళ్యాణం వైభోగం

ఆనంద రాగాల శుభయోగం

రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ

వరమాలకై వేచు సమయాన

శివధనువు విరిచాకే

వధువు మది గెలిచాకే

మోగింది కళ్యాణ శుభవీణ

కళ్యాణం వైభోగం

శ్రీ రామచంద్రుని కళ్యాణం

అపరంజి తరుణి అందాల రమణి

వినగానే కృష్ణయ్య లీలామృతం

గుడి దాటి కదిలింది, తనవెంట నడిచింది

గెలిచింది రుక్మిణీ ప్రేమాయణం

కళ్యాణం వైభోగం

ఆనంద కృష్ణుని కళ్యాణం

పసిడి కాంతుల్లో పద్మావతమ్మ

పసి ప్రాయములవాడు గోవిందుడమ్మ

విరి వలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే

కళ్యాణ కళలొలికినాడమ్మ

ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు

ఋణమైన వెనుకాడలేదమ్మ

కళ్యాణం వైభోగం

శ్రీ శ్రీనివాసుని కళ్యాణం

వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవాన

పసుపుకుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన

వరుడంటు వధువంటు ఆ బ్రహ్మముడి వేసి జతకలుపు తంతే ఇది

స్త్రీ పురుష సంసార సాగరపు మదనాన్ని సాగించమంటున్నది

జన్మంటు పొంది జన్మివ్వలేని

మనుజునకు సార్ధక్యముండదు కదా

మనుగడను నడిపించు కళ్యాణమును మించి

ఈ లోక కళ్యాణమే లేదుగా

కళ్యాణం వైభోగం

ఆనంద రాగాల శుభయోగం

- It's already the end -