00:00
04:11
Freedom... freedom
♪
హేయ్ పొగరు పోటి మాదే
వయసు వేడి మాదే
ఎదిగే హక్కు మాదే
వేదం వేగం మాదే
పోరు పంతం మాదే
ఉడికే రక్తం మాదే
గెలిచే నైజం మాదే
ఈ సిద్దాంతం మాదే
ఎవడెంత అయినా భయమే ఎరుగని
యవ్వన మంత్రం మాదే మాదే మాదేలే
(Freedom) ఇది మాకే మాకే సొంతం
(Freedom) ఇది యువతకు మంత్రం
(Freedom) ఇది మాకే మాకే సొంతం
(Freedom) touch చేస్తే చేస్తాం అంతం
♪
తెల్లని కాగితం రాసుకో జీవితం
ఏదిరా శాశ్వతం కీర్తిరా నిరంతరం
నీ తెగువే చూపైన
నీ గాధను చాటెయ్ నా
తెలుగు వీర లేవరా (హేయ్)
నీ ధాటికి ఎవడైనా నీకెదురే నిలిచేన
నిన్నే నువ్వు నమ్మావంటే లోకం నీదేరా
(Freedom) ఇది మాకే మాకే సొంతం
(Freedom) ఇది యువతకు మంత్రం
(Freedom) ఇది మాకే మాకే సొంతం
(Freedom) touch చేస్తే చేస్తాం అంతం
♪
ఏయ్ ఎందరో ఆశకి కొందరే ఊపిరి
అందులో ఒకడివై వెలగరా వెయ్యేళ్లకి
ఏలేసే రాతుంటే ఏ మూలే నువ్వున్నా
వెతుకుతారు చూడరా
హేయ్ నీ చూపుకి మాటుంటే
ఆ మాటకు ఊపుంటే
ఎవడో ఎపుడో రాసే చరితకు
పునాదే నువ్వేరా
(Freedom) ఇది మాకే మాకే సొంతం
(Freedom) ఇది యువతకు మంత్రం
(Freedom) ఇది మాకే మాకే సొంతం
(Freedom) touch చేస్తే చేస్తాం అంతం