00:00
03:31
అణువణువూ అలలెగసే
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే
కాలాలు కళ్లారా చూసేనులే
వసంతాలు వేచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర తీరాలు
నీ కోసమే మే
అణువణువూ అలలెగసే
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే
♪
ఓ చోటే ఉన్నాను
వేచాను వేడానుగా కలవమని
నాలోనే ఉంచాను
ప్రేమంతా దాచానుగా పిలవమని
తారలైన తాకలేని తాహతున్న ప్రేమని
కష్టమేది కానరాని
ఏది ఏమైనా ఉంటానని
కాలాలు కళ్లారా చూసేనులే
వసంతాలు వేచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర తీరాలు
నీ కోసమే మే
కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే
కరిగెనుగా ఓ ముగిసెనుగా ఇన్నాళ్ల వేదనే
మరిచా ఏనాడో ఇంత సంతోషమే
తీరే ఇపుడే పాత సందేహమే
నాలో లేదే మనసే నీతో చేరే
మాటే ఆగి పోయే పోయే పోయే
ఈ వేళనే
అణువణువూ అలలెగసే
తెలియని ఓ ఆనందమే
కనులెదుటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే