00:00
02:53
ఉండిపోరాదే
గుండె నీదేలే
హత్తుకోరాదే
గుండెకే నన్నే
అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ
మళ్ళీమళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నదీ
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే
గుండె నీదేలే
హత్తుకోరాదే
గుండెకే నన్నే
♪
నిశిలో శశిలా నిన్నే చూశాక
మనసే మురిసే ఎగసే అలలాగ
ఏదో మైకంలో నేనే ఉన్నాలే
నాలో నేనంటూ లేనులే
మండే ఎండల్లో వెండి వెన్నెలనే
ముందే నేనెపుడూ చూడలే
చీకట్లో కూడ నీడలా
నీవెంటే నేను ఉండగా
వేరే జన్మంటూ నాకే ఎందుకులే
నీతో ఈ నిమిషం చాలులే
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే