00:00
04:03
నిజమేనా నిజమేనా
మన కథ ముగిసెనా
చీకటిలో ఒంటరిగా
నా మది మిగిలెనా
నా గతము నేనే వదులుకున్నా
అది నను వదలదే
నీ గురుతులన్నీ చెరపమన్నా
హృదయము చెరపదే
ఏ నిన్న తప్పో నేటికెదురై
నను నిలదీసెనే
నీ మరువలేని జ్ఞాపకాలే
నను వెలి వేసెనే
తొలి ప్రేమా...!
నీ గుండెలో గాయమా
తొలి ప్రేమా...!
నా వల్లే అనకుమా
తొలి ప్రేమా...!
నీ గుండెలో గాయమా
తొలి ప్రేమా...!
నా వల్లే అనకుమా
♪
నిజమేనా నిజమేనా
మన కథ ముగిసెనా
చీకటిలో ఒంటరిగా
నా మది మిగిలెనా
♪
నేరమే ఎవరిదో తేలదుగా తేల్చవుగా
పంతమే ఎందుకో అడగవుగా విడవవుగా
నేనే ఊపిరి పంచినా నేనే కాదని తెంచినా
నేనే కోరి నేనే వీడి నిలకడ మరిచినా
నీ రాక మళ్ళీ నిదురపోయే కలలను పిలిచెనే
ఈ వీడుకోలే ఎంత బాధో నేడే తెలిసెనే
తొలి ప్రేమా...!
నీ గుండెలో గాయమా
తొలి ప్రేమా...!
నా వల్లే అనకుమా
తొలి ప్రేమా...!
నీ గుండెలో గాయమా
తొలి ప్రేమా...!
నా వల్లే అనకుమా