background cover of music playing
Yetu Pone - Kala Bhairava

Yetu Pone

Kala Bhairava

00:00

04:09

Similar recommendations

Lyric

ఎటు పోనే

నిను తలచి తలచి కలలు విడిచి ఎటు పోనే

ఎటు పోనే

ఎదకెదురు నిలిచే పిలుపు విడిచి ఎటు పోనే

బహుదూరపు దారిలో

నిను చేరే మలుపుకే

నడిపించే దిక్కుకై నిను వెతికానే

తెగుతున్నా దారమే

గురుతులతో నేయనా

మన గాలిపటమునే నేనెగరెయనా

ఆపలేని కోపమే మార్చలేని లోపమా

అదుపులేని మంటని నేను

వచ్చి కౌగలించవా

మంచై ఆవహించవా

నిదరే రాదు

కన్నీటికే అడ్డేపడే కల-మరకలే చెరగవే

పడిలేచె పయనాలే

ఓర్పంటె నేర్పెనులే

ఏకాంతం సాయం (శాంతముకే అడిగితినే)

పంటి బిగువున బాధనిచే

నవ్వుతున్నా నిను తలచే

ఏమైనా నాతో వేరవని తీరోకటే

వెళ్లొద్దే వెళ్లొద్దే నువ్వే (వెళ్లొద్దే)

ఉంటానే తగ్గుండే నదై (తగ్గుంట)

నీ రక్తం నీ వెన్నెలే పడుతుంటే నాలో

నేనొక ఎగసే ఉప్పెననే

చిగురాకైనా రాల్చనులే

కురులను సైతం బాధించని ఓ గాలే అవనా

తేదీలేని మాసమై, ఎండమావి తీరమై

ఉండలేను ఊపిరాగుతూ

ఇంకా నీకు దూరమై

ఇంకా నీకు దూరమై

ఎటు పోనే

నిను తలచి తలచి కలలు విడిచి ఎటు పోనే

ఎటు పోనే

ఎటు పోనే ఎదకెదురు నిలిచే పిలుపు విడిచి ఎటు పోనే

- It's already the end -