00:00
04:15
ఓ సోనియే ఓ సోనియే (ఓ సోనియే)
♪
అరెరే ఎవ్వరూ ఏం
చెప్పలేదా ఒక్కసారి
(ఇన్నాళ్లు గాలిలోనే)
(తేలియాడే చిట్టి అడుగా)
సరిలే ఇపుడైనా
తెలిసిందిగా తొలిసారి
(ఇకనైనా నేల తాకి)
(నేర్చుకోవే కొత్త నడక)
ఇన్నాళ్లు నిన్నెత్తుకొని
ఊరేగించిన ఈ లోకం
తన బరువు తానే సరిగా
మోయలేని ఓ మాలోకం
(ఇన్నాళ్లు గాలిలోనే)
(తేలియాడే చిట్టి అడుగా)
(ఇకనైనా నేల తాకి)
(నేర్చుకోవే కొత్త నడక)
♪
శిలలాంటి నిన్ను ఇలా
శిల్పంగా మలిచింది
ఆ నవ్వులో చురకలే
నీ సొంత కలలాగా
నీ కంట నిలిచింది
ఆ దివ్వెలో మెరుపులే
అచ్చంగా తనలా ఉందా
అద్దం చూపే నీ రూపం
నీ సొంత చిరునామాలా
కనిపిస్తోందా ఈ మలుపు
(ఇన్నాళ్లు గాలిలోనే)
(తేలియాడే చిట్టి అడుగా)
(ఇకనైనా నేల తాకి)
(నేర్చుకోవే కొత్త నడక)
♪
ఎన్నెన్ని జన్మాలైనా తెగిపోని
బంధం ఏదో
ఎదురైంది నీ దారిలో
మాటలకు అందని భావం
మనసెలా గుర్తిస్తుందో
తెలిసింది ఆ చెలిమితో
ఇంకెవరి కళ్లో చూసే
కలవే నువ్వు ఇన్నాళ్లు
ఎంత బాగుందో చూడు
నీ తొలి వేకువ ఈనాడు
(ఇన్నాళ్లు గాలిలోనే)
(తేలియాడే చిట్టి అడుగా)
(ఇకనైనా నేల తాకి)
(నేర్చుకోవే కొత్త నడక)
అరెరే ఎవ్వరూ ఏం
చెప్పలేదా ఒక్కసారి
(ఇన్నాళ్లు గాలిలోనే)
(తేలియాడే చిట్టి అడుగా)
సరిలే ఇపుడైనా
తెలిసిందిగా తొలిసారి
(ఇకనైనా నేల తాకి)
(నేర్చుకోవే కొత్త నడక)
ఇన్నాళ్లు నిన్నెత్తుకొని
ఊరేగించిన ఈ లోకం
తన బరువు తానే సరిగా
మోయలేని ఓ మాలోకం
(ఇన్నాళ్లు గాలిలోనే)
(తేలియాడే చిట్టి అడుగా)
(ఇకనైనా నేల తాకి)
(నేర్చుకోవే కొత్త నడక)
(ఇన్నాళ్లు గాలిలోనే)
(తేలియాడే చిట్టి అడుగా)
(ఇకనైనా నేల తాకి)
(నేర్చుకోవే కొత్త నడక)
ఓ సోనియే హే హే ఏ ఏ