00:00
04:36
తలచి తలచి చూస్తే, తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటినీ
ఓ, నీలో నన్ను చుసుకుంటినీ
తెరచి చూసి చదువు వేళ
కాలిపోయే లేఖ రాశా
నీకై నేను బ్రతికి ఉంటిని
ఓ, నీలో నన్ను చూసుకుంటిని
♪
కొలువు తీరు తరువుల నీడ
చెప్పుకొనును మన కథనెపుడూ
రాలిపోయెనా పూల గంధమా
రాక తెలుపు మువ్వల సడిని
తలుచుకొనును దారులు ఎపుడూ
పగిలిపోయెనా గాజుల అందమా
అరచేత వేడిని రేపే చెలియ చెయి నీ చేత
ఒడిలో వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు
తోలి స్వప్నం చాలె ప్రియతమా
కనులూ తెరువుమా
♪
మధురమైన మాటలు ఎన్నో
కలిసిపోవు నీ పలుకులలో
జగము కరుగు రూపే కరుగునా
చెరిగిపోని చూపులు అన్ని
రేయి పగలు నిలుచును నీలో
నీదు చూపు నన్ను మరచునా
వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు
కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా
ఒక సారి కాదురా ప్రియతమా
ఎపుడు పిలిచినా
తలచి తలచి చూస్తే
తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటినీ
ఓ, నీలో నన్ను చుసుకుంటినీ