background cover of music playing
Nekoosam Nekoosam - S. P. Balasubrahmanyam

Nekoosam Nekoosam

S. P. Balasubrahmanyam

00:00

05:26

Similar recommendations

Lyric

నీకోసం నీకోసం జీవించా చిలకా

నా ప్రాణం నీవేనే మణితునకా

నాకోసం నాకోసం నిన్నే

నా జతగా

ఏ దైవం పంపెనో బహుమతిగా

నిన్నూ నన్నూ పెనవేసే

ప్రేమే సాక్షిగా

కన్నూ కన్నూ కలబోసే

కలలే పండగా

మిన్నూ మన్నూ ఏకం

చేద్దాం హరివిల్లుగా

నాకోసం నాకోసం నిన్నే

నా జతగా

ఏ దైవం పంపెనో బహుమతిగా

నా ఊపిరిలో ఉయ్యాలేసి

నూరేళ్ళ కాలం

నిను లాలించాలి వెచ్చని

కలల్ని పంచాలి

నీ స్నేహంలో స్నానం చేసి

నా కన్నె దేహం

తరించిపోవాలి తీయని స్వరాలూ పాడాలి

పరులకు ఎన్నడూ తెలియని

చల్లని చెలిమితో ఈ నా అనురాగం

నీ గుండెనే మీటని

విరహపు వేడికి కనబడకా

విడవని జోడుగా ముడిపడగా

అల్లే ఈ బంధం

కలకాలం ఉండిపోని

నీకోసం నీకోసం జీవించా చిలకా

నా ప్రాణం నీవేనే మణితునకా

కాసేపైనా కల్లోనైనా నీ ఊహలేని

క్షణాలు ఉన్నాయా ఒంటరి

తనాలు ఉన్నాయా

ఏం చేస్తున్నా ఎటు చూస్తున్నా

నీ రూపులోనే ప్రతీది చూస్తున్నా

నిన్నే ప్రపంచమంటున్నా

మమతలు చిందిన మధువుల విందుకు

అతిధులుగా ఆహ్వానిద్దాం ఆరారు కాలాలని

అలలకు అందని జాబిలిని

వెన్నెల వానగా దించుకునే

గెలిచే సంద్రంలా సంతోషం

పొంగి పోని

నాకోసం నాకోసం నిన్నే

నా జతగా

ఏ దైవం పంపెనో బహుమతిగా

నిన్నూ నన్నూ పెనవేసే

ప్రేమే సాక్షిగా

కన్నూ కన్నూ కలబోసే

కలలే పండగా

మిన్నూ మన్నూ ఏకం

చేద్దాం హరివిల్లుగా

- It's already the end -