00:00
02:42
కనురెప్పల కాలంలోనే
కథ మొత్తం మారేపోయిందే
కనుతెరిచి చూసేలోగా
దరిచేరని దూరం మిగిలిందే
ఇన్నాళ్ళూ ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో
మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో
జరిగినది వింతేనా
మన పయనం ఇంతేనా
♪
కనురెప్పల కాలంలోనే
కథ మొత్తం మారేపోయిందే
♪
కవి ఎవరో ఈ కథకి
ఎవరెవరో పాత్రలకి
తెలియదుగా ఇప్పటికీ
పొడుపు కథే ఎప్పటికీ
మనమంటు అనుకున్నా
ఒంటరిగానే మిగిలున్నా
ఇందరిలో కలిసున్నా
వెలితిని నేను చూస్తున్నా
పొరపాటు ఏదో తొరబాటు ఏదో
అది దాటలేని తడబాటు ఏదో
ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా