00:00
04:20
గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదర
గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెర
♪
విరిసిన పూ మాలగా వెన్నుని ఎదవాలగా
తలపుని లేపాలిగా బాలా
పరదాలే తీయకా పరుపే దిగనీయకా
పవళింపా ఇంతగా మేరా
కడవల్లో కవ్వాలు సడిచేస్తున్నా వినక
గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలక
కలికి ఈ కునుకేలా తెల్లవారవచ్చెనమ్మా
గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదర
గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెర
♪
నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవనీ
నువు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి
నీ కోసమని గగనమే భువిపైకి దిగివచ్చెనని
ఆ రూపాన్నీ చూపుతో అల్లుకుపో సౌదామిని
జంకేలా జాగేలా సంకోచాలా జవ్వని
బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేతచిక్కి
పిల్లనగ్రోవై ప్రియమారా నవరాగాలే పాడనీ
అంటూ ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరాన
గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదర
గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెర
♪
ఏడే అల్లరి వనమాలి, నను వీడే మనసున దయమాలి
నందకుమారుడు మురళీ లోలుడు నా గోపాలుడు ఏడే... ఏడే
లీలా కృష్ణ కొలమిలో కమలములా కన్నెమది
తనలో తృష్ణ తేనేల విందిస్తానంటున్నది
అల్లరి కన్న దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
అందరికన్నా ముందుగా తనవైపే రమ్మన్నదీ
విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక
చూస్తూనే చేజారీ ఈ మంచివేళ మించనీక
త్వరపడవమ్మా సుకుమారి ఏ మాత్రం ఏమారక
వదిలావో వయ్యారి బృందవిహారి దొరకడమ్మ
గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదర
గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెర
గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదర
గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెర