background cover of music playing
Muddabanthi (From "Kousalya Krishnamurthy") - Dhibu Ninan Thomas

Muddabanthi (From "Kousalya Krishnamurthy")

Dhibu Ninan Thomas

00:00

04:12

Similar recommendations

Lyric

ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా

ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా

నేటికి నేడు మారిన ఈడు చేసె నేరమే

నిద్దుర లేదు ఆకలి లేదు అన్ని దూరమే

చక్కదనాల చుక్కకివాళ దిష్టి తీసి హారతీయనా

అమ్మడివే

(స, ద ని స, ద ని స మా గ మ, గ స

ద ని స, గ గ స, ద ప గ స, గ గ, స ని ద ని స)

కలలను దాచే నా కన్ను నీవే

నిజమైపోవే నావన్ని నీవే

పగలే మెరిసే మిణుగురువే

నగలే వెలిసే వెలుగు నువే

ఇలపై నడిచే మెరుపు నువే 'హా

ఇకపై వరమై దొరుకు నువే

నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే

నేనెపుడూ నీ వెంటే ఉంటా

ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా

ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా

పరుగులు తీసే నా రాణి నీవే

పడితే మెత్తని నేలౌతాలే

ఎపుడూ నిలిచే భుజమౌతా

కలను కంటే నిజమౌతా

కష్టం వస్తే కలబడతా 'హా

కడదాకా నే నిలబడతా

అలిసొస్తే జో కొడతా

గెలిచొస్తే జై కొడతా

కలిసొస్తే ఓ గుడినే కడతా

ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా

ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా

హోయ్ మౌనంగానే సైగలతోనే ఎంత కాలమే

జాలిని చూపి దగ్గరయ్యేటి దారి చూపవే

ఆపసోపాలే నావిక ఆపే, ఒక్కసారి చెంత చేరవే

అమ్మడివే

అమ్మడివే

(తందానానే నా)

- It's already the end -