00:00
02:11
ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా
ఇగురేసిన జీవితమంతా చిదిమేసెను చీకటిలా
బాధనీరుకూడ భాషలేక గొంతు మూగబోయెనా
పొగిలినంతలోన పొంత నిండలేని నిండు-వేదన
చేరదీయబోతే సాయమేమో యతి-నీడ చేర్చెనా
నేరమెవ్వరిదో దారితప్పి నిన్ను చుట్టివేసెనా
♪
పోలికలేని పొరలలోన అడుగులు ఉన్నా
పొరపడిన పగకు నేనే పావును కానా
దోషమేది చేయకున్నా దోషిలాగ ఉన్నా
పాశమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా
ముందుచూపు లేక చేసే సాయం
నిందమోసి నిండుకుందా న్యాయం
ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా
బాధనీరుకూడ భాషలేక గొంతు మూగబోయెనా
పొగిలినంతలోన పొంత నిండలేని నిండు-వేదన
చేరదీయబోతే సాయమేమో యతి-నీడ చేర్చెనా
నేరమెవ్వరిదో దారితప్పి నిన్ను చుట్టివేసెనా