background cover of music playing
Vrepalliya Edajhalluna - S. P. Balasubrahmanyam

Vrepalliya Edajhalluna

S. P. Balasubrahmanyam

00:00

05:51

Similar recommendations

There are no similar songs now.

Lyric

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి

నవరస మురళి

ఆ నందన మురళి ఇదేనా

ఇదేనా ఆ మురళి మోహన మురళి

ఇదేనా ఆ మురళి

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి

నవరస మురళి

ఆ నందన మురళి

ఇదేనా ఆ మురళి మోహన మురళి

ఇదేనా ఆ మురళి

కాళింది మడుగున కాళీయుని పడగల

ఆబాల గోపాల మాబాల గోపాలుని

కాళింది మడుగున కాళీయుని పడగల

ఆబాల గోపాల మాబాల గోపాలుని

అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ

అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ

తాండవమాడిన సరళి

గుండెలనూదిన మురళి ఇదేనా

ఇదేనా ఆ మురళి

అనగల రాగమై తొలుత వీనులలరించి

అనలేని రాగమై మరలా వినిపించి

మరులే కురిపించి

అనగల రాగమై తొలుత వీనులలరించి

అనలేని రాగమై మరలా వినిపించి

మరులే కురిపించి

జీవనరాగమై బృందావన గీతమై

ఆ జీవనరాగమై బృందావన గీతమై

కన్నెల కన్నుల కలువల

వెన్నెల దోచిన మురళి ఇదేనా

ఇదేనా ఆ మురళి

ఆ వేణుగాన లోలుని మురుపించిన రవళి

నటనల సరళి ఆ నందన మురళి

ఇదేనా ఆ మురళి మువ్వల మురళి

ఇదేనా ఆ మురళి

మధురా నగరిలో యమునా లహరిలో

ఆ రాధ ఆరాధనాగీతి పలికించి

మధురా నగరిలో యమునా లహరిలో

ఆ రాధ ఆరాధనాగీతి పలికించి

సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై

సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై

రాసలీలకే ఊపిరిపోసిన

అందెల రవళి ఇదేనా

ఇదేనా ఆ మురళి

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి

నవరస మురళి

ఆ నందన మురళి

ఇదేనా ఆ మురళి మోహన మురళి

ఇదేనా ఆ మురళి

- It's already the end -