background cover of music playing
Kommana Kulike Koyile - S. P. Balasubrahmanyam

Kommana Kulike Koyile

S. P. Balasubrahmanyam

00:00

04:31

Similar recommendations

Lyric

కొమ్మన కులికే కోయిల

ఓ కమ్మని పాట పాడవే

కమ్మగ నవ్వే నెచ్చెలి

నీ అందెల సవ్వడి చెయ్యవే

ఓ మామా ఓ భామా

ఎదలోయల దాగిన చిత్రమా

కనుసైగలు చేసిన ఆత్రమా

ఉదయాలకు నీవే ప్రాణమా

కసి ముద్దులు రాసిన కావ్యమా

వయ్యారాల వీణ మీటి

దోచుకున్న నేస్తమా

కొమ్మన కులికే కోయిల

ఓ కమ్మని పాట పాడవే

తేనెలు మరిగిన తుమ్మెదా

కను చూపుల గారడి చేయకే

చెప్పెయ్ వా చెవిలోన ఒక మాట

పువ్వులతో తుమ్మెద చెప్పేమాట

నీ చిరునవ్వు సాక్షిగా

తాజమహల్ నాదట

నీ పెదవంచు సాక్షిగా

షాజహాను నేనట

నీ తియ్యని ప్రేమకి

నా పెదవే నజరానా

నీ పైటకి నేనిక

బానిసనే నెరజాణ

అనంతాల ఆర్త నీవై

చేరుకున్న వేళలో

కోకలు కట్టిన కోయిల

ఓ కమ్మని కౌగిలియవే

తేనెలు మరిగిన తుమ్మెద

కను చూపుల గారడి చేయకే

పూసింది కౌగిట్లో పులకింత

వెచ్చంగా పాకింది ఒళ్ళంతా

పదహారేళ్ళ యవ్వనం పదిలంగా దాచిన

నీ మెడలోని తాళినై నూరేళ్లు దాగన

నీ చెంతకు చేరా

విరహంతో పడలేక

నును మెత్తని పరువం

రాసింది శుభలేఖ

సరగాల సాగరాన స్వాతిచినుకై సోలిపో

కొమ్మన కులికే కోయిల

ఓ కమ్మని పాట పాడవే

తేనెలు మరిగిన తుమ్మెదా

నీ అల్లరి పనులిక ఆపవే

ఓ భామ ఓ మామ

ఉదయాలకు నీవే ప్రాణమా

కసి ముద్దులు రాసిన కావ్యమా

ఎదలోయల దాగిన చిత్రమా

కనుసైగలు చేసిన ఆత్రమా

వయ్యారాల వీణ నీవై

దోచుకున్న అందమా

కొమ్మన కులికే కోయిల

ఓ కమ్మని పాట పాడవే

కమ్మగ నవ్వే నెచ్చెలి

నీ అందెల సవ్వడి చెయ్యవే

- It's already the end -