background cover of music playing
Jabiliki - Hariharan

Jabiliki

Hariharan

00:00

04:41

Song Introduction

ప్రస్తుతం ఈ పాట గురించి సమాచారం అందుబాటులో లేదు.

Similar recommendations

Lyric

జాబిలికి వెన్నెలలిస్తా మబ్బులకి మెరుపులనిస్తా

పూవులకి పరిమళమిస్తా వాగులకి వరదలనిస్తా

గాజులకి చేతులనిస్తా గజ్జెలకి పాదాలిస్తా

కాటుకకి కన్నులనిస్తా పాటలకి మౌనాలిస్తా

ఊరూ పేరు తెలియని వాటికి ఏవేవో ఇచ్చి

నీకు నా మనసిస్తా మనసులో చోటిస్తా

నీకు నా ముద్దిస్తా ప్రేమనే ముద్రిస్తా

నీకు నా మనసిస్తా మనసులో చోటిస్తా

నీకు నా ముద్దిస్తా ప్రేమనే ముద్రిస్తా

జాబిలికి వెన్నెలలిస్తా మబ్బులకి మెరుపులనిస్తా

పూవులకి పరిమళమిస్తా వాగులకి వరదలనిస్తా

కొత్త సిగ్గు నీకివ్వను నీ అల్లరికిస్తాను

కౌగిలింత నీకివను నీ పొగరుకి ఇస్తాను

కొంటె కబురు నీకివ్వను నీ ఊపిరికిస్తాను

పంటి పదును నీకివ్వను నీ పెదవికి ఇస్తాను

ఇన్నినాళ్ళు దాచుకున్న కన్నెతనం నీకివ్వను

ఇన్నినాళ్ళు దాచుకున్న కన్నెతనం నీకివ్వను

కొన్నినాళ్ళు వేచి ఉన్న నీ కుర్రతనానికి ఇస్తా (ఇస్తా, ఇస్తా)

నీకు నా చెలిమిస్తా చెలిమిలో చనువిస్తా

కొద్దిగా అలుసిస్తా పూర్తిగా విలువిస్తా

వలపు ఎరుపు నీకివ్వను నీ పాపిటకిస్తాను

చిలిపి ముడుపు నీకివ్వను నీ చీకటికిస్తాను

ఎదను ఒలిచి నీకివ్వను నీ దోసిలికిస్తాను

ఎదురుచూపు నీకివ్వను నీ వాకిలికిస్తాను

మండపాన కోరుకున్నా మూడుముళ్ళు నీకివ్వను

మండపాన కోరుకున్నా మూడుముళ్ళు నీకివ్వను

గుండెలోన చేరుకున్న నీ ఏడుజన్మలకు ఇస్తా (ఇస్తా, ఇస్తా)

నీకు నా మనవిస్తా మనువుతో తనువిస్తా

తనువుతో చనువిస్తా తనివినే తీరుస్తా

నీకు నా మనసిస్తా మనసులో చోటిస్తా

నీకు నా ముద్దిస్తా ప్రేమనే ముద్రిస్తా

నీకు నా చెలిమిస్తా చెలిమిలో చనువిస్తా

కొద్దిగా అలుసిస్తా పూర్తిగా విలువిస్తా

- It's already the end -