00:00
03:37
రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో
ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా
ఏడు రంగులొక్కటై పరవశించు వేళలో
నేలకే జారిన కొత్త రంగులా
వానలా, వీణలా, వాన వీణ వాణిలా
గుండెలో పొంగిన కృష్ణవేణిలా
ఒంటరి మనసులో ఒంపి వెళ్ళకే అలా
సరిగమల్ని తియ్యగా ఇలా
ప్రేమ వెన్నెల
రావే ఊర్మిళా
ప్రేమ వెన్నెల
రావే ఊర్మిళా
రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో
ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా
ఏడు రంగులొక్కటై పరవశించు వేళలో
నేలకే జారిన కొత్త రంగులా
హ్మ్... దిద్దితే నువ్వలా కాటుకే కన్నుల
మారదా పగలిలా అర్ధరాత్రిలా
నవ్వితే నువ్వలా మెల్లగా మిలమిలా
కలవరం గుండెలో కలత పూతలా
రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా
మారిపోయెనేమో నీ రెండు కళ్ళలా
నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమన
నిన్ను చూసే రాసినాడలా
ప్రేమ వెన్నెల
రావే ఊర్మిళా
ప్రేమ వెన్నెల
రావే ఊర్మిళా
నడవకే నువ్వలా కలలలో కోమలా
నడవకే నువ్వలా కలలలో కోమలా
పాదమే కందితే మనసు విలవిలా
విడువకే నువ్వలా పలుకులే గలగలా
పెదవులే అదిరితే గుండె గిలగిలా
అంతులేని అంతరిక్షమంతు చూడకే అలా
నీలమంత దాచిపెట్టి వాలుకన్నులా
ఒక్కసారి గుండెలోకి అడుగుపెట్టి రా ఇలా
ప్రాణమంత పొంగిపోయేలా
ప్రేమ వెన్నెల (ప్రేమ వెన్నెల)
రావే ఊర్మిళా (రావే ఊర్మిళా)
ప్రేమ వెన్నెల... ఓ (ప్రేమ వెన్నెల)
రావే ఊర్మిళా