background cover of music playing
Manasaa - A.R. Rahman

Manasaa

A.R. Rahman

00:00

04:11

Song Introduction

ప్రస్తుతం ఈ పాట గురించి సంబంధిత సమాచారం లేదు.

Similar recommendations

Lyric

(ఎవ్వరికి ఎవ్వరిని జంటగా అనుకుంటాడో

ఆఖరికి వాళ్ళనే ఓ చోట కలిపేస్తాడు)

మనసా, మళ్లీ మళ్లీ చూశా

గిల్లీ గిల్లీ చూశా

జరిగింది నమ్మేశా

జతగా నాతో నిన్నే చూశా

నీతో నన్నే చూశా

నను నీకు వదిలేశా

పైలోకంలో వాడు

ఎపుడో ముడి వేశాడు

విడిపోదే విడిపోదే

(తను వానవిల్లంట

నువు వానజల్లంట

నీలోన ఈ ప్రేమ కిరణం కిరణం

తను కంటిపాపంట

నువు కంటిరెప్పంట

విడదియ్యలేమంట ఎవ్వరం, ఎవ్వరం)

మనసా, మళ్లీ మళ్లీ చూశా

నీ కళ్లలో చూశా

నూరేళ్ల మన ఆశ

జతగా నాతో నిన్నే చూశా

నా తోడల్లే చూశా

నీ వెంట అడుగేశా

తియ్యనైన చీకటిని తలుచుకునే వేకువలు

హాయి మల్లెతీగలతో వేచి ఉన్న వాకిళులు

నింగీ నేలా గాలి

నీరూ నిప్పూ అన్నీ

అదిగో స్వాగతమన్నాయి

(తను వానవిల్లంట

నువు వానజల్లంట

నీలోన ఈ ప్రేమ కిరణం కిరణం

తను కంటిపాపంట

నువు కంటిరెప్పంట

విడదియ్యలేమంట ఎవ్వరం ఎవ్వరం)

మనసా, మళ్లీ మళ్లీ చూశా

నీ కళ్లలో చూశా

నూరేళ్ల మన ఆశ

జతగా నాతో నిన్నే చూశా

నా తోడల్లే చూశా

నీ వెంట అడుగేశా

పైలోకంలో వాడు

ఎపుడో ముడి వేశాడు

విడిపోదే విడిపోదే

(తను వానవిల్లంట

నువు వానజల్లంట

నీలోన ఈ ప్రేమ కిరణం కిరణం

తను కంటిపాపంట

నువు కంటిరెప్పంట

విడదియ్యలేమంట ఎవ్వరం ఎవ్వరం)

ప్రేమ జగం విడుచు క్షణం పెళ్లి అనుకుంటే

పెళ్లి యుగమే ముగిసేది మరణంతోనే

- It's already the end -