background cover of music playing
Gira Gira Gira - Gowtham Bharadwaj

Gira Gira Gira

Gowtham Bharadwaj

00:00

04:42

Similar recommendations

Lyric

గిర గిర గిర తిరగలి లాగా తిరిగి అరిగిపోయినా

దినుసే నలగలేదులే

(హొయ్ హొయ్ హొయ్ హొయ్)

అలుపెరగక తనవెనకాలే అలసి సొలసి పోయినా

మనసే కరగలేదులే

(హొయ్ హొయ్ హొయ్ హొయ్)

చినదేమో తిరిగే చూడదే

ప్రేమంటే అసలే పడదే (హోయ్)

గిర గిర గిర తిరగలి లాగా తిరిగి అరిగిపోయినా

దినుసే నలగలేదులే

(హొయ్ హొయ్ హొయ్ హొయ్)

అలుపెరగక తనవెనకాలే అలసి సొలసి పోయినా

మనసే కరగలేదులే

అలలు అలిసి చతికిలపడునా

కలలు నిలిచి కలవరపడునా

సహజ గుణము నిమిషము విడునా

ఏమి జరిగినా

మనసునెపుడు వదలని తపన

వినదు అసలు ఎవరేమనినా

గగనమొరిగి తనపై పడినా

ఆశ కరుగునా

వేసవిలోన పెనుతాపం ఓ ఆరాటంలా

నింగిని తాకి దిగి రాదా వర్షంలా

గిర గిర గిర తిరగలి లాగా తిరిగి అరిగిపోయినా

దినుసే నలగలేదులే

సన్నాయి డోలు పెళ్లిపాట పాడే

అబ్బాయి ఓరకంట చూస్తున్నాడే

బంగారు బొమ్మ తల ఎత్తి చూడే

నీ ఈడు జోడే అందాల చందురుడే

ఎవరికెవరు తెలియదు మునుపు

అడిగి అడిగి కలగదు వలపు

ఒకరికొకరు అని కలపనిదే

మనని వదులునా

ఎదురుపడిన క్షణమొక మలుపు

అడుగు కలిపి కదిలితే గెలుపు

దిశలు రెండు వేరై ఉన్నా, పయనమాగునా

నేనంటే తానే తను నేనే ఒకటై ఉన్నానే

పొమ్మన్నా పోనే పడతానే లేస్తానే

గిర గిర గిర తిరగలి లాగా తిరిగి అరిగిపోయినా

దినుసే నలగలేదులే (హొయ్ హొయ్ హొయ్ హొయ్)

అలుపెరగక తనవెనకాలే అలసి సొలసి పోయినా

మనసే కరగలేదులే

- It's already the end -