background cover of music playing
Life Of Ram - Pradeep Kumar

Life Of Ram

Pradeep Kumar

00:00

06:04

Song Introduction

ఈ పాట గురించి ప్రస్తుతం ఏ సమాచారం లభ్యం కాలేదు.

Similar recommendations

Lyric

ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా?

ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా

ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా?

ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా

కదలని ఓ శిలనే అయినా, తృటి లో కరిగే కలనే అయినా

ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా?

ఇల్లాగే కడ దాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా

ఏదో ఒక బదులై నన్ను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్నా

నా వెంట పడి నువ్వింత ఒంటరి అనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ

ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు

నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది

నా యద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి

ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా

కాలం ఇప్పుడే నను కనగా

అనగనగా అంటూనే ఉంటా ఎపుడూ పూర్తవనే అవక తుది లేని కథ నేనుగా

గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక

కాలు నిలవదు యే చోటా

నిలకడగా

ఏ చిరునామా లేక, ఏ బదులు పొందని లేఖ, ఎందుకు వేస్తోందో కేక

మౌనంగా

నా వెంట పడి నువ్వింత ఒంటరివనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ

ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు

నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది

నా యద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి

లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా

విన్నారా

నేనూ నా నీడ ఇద్దరమే చాలంటున్నా

రాకూడదు ఇంకెవరైనా

అమ్మ ఒడిలో మొన్న

అందని ఆశల తో నిన్న

ఎంతో ఊరిస్తూ ఉంది జాబిల్లి

అంత దూరానున్నా వెన్నెలగా చెంతనే ఉన్నా

అంటూ ఊయలలూపింది జోలాలి

- It's already the end -