00:00
03:57
ఇప్పటికే ఈ గీత గురించి సంబంధిత సమాచారం అందుబాటులో లేదు.
నిన్నలా లేదే మొన్నలా లేదే
ఈ రోజిలా ఎందుకే?
నిన్నిలా నాకే కొత్తగా చూపే
ఈ వేళిలా ఎందుకే?
నువ్విలా నాలో నేనిలా నీలో
లీనమైపోయేందుకే?
నిన్నలా లేదే మొన్నలా లేదే
ఈ రోజిలా ఎందుకే?
నా ఈ గుండె నా అదుపు తప్పి
నా ఈ కనులు నీ వైపు తిప్పి
నా ఈ మనసు నీతోటి కలిపి
నేనే నీలో నిలువెల్ల కలిసి
నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి
మౌనంగానె ఏదేదొ తెలిపి
నాలో ఉన్న ప్రాణాలు నలిపి
నేనే నాకు లేకుండ చేసి
ఇది ప్రేమా అనుకుంటు అడుగేసానా నేనేనా?
నిను నేనే ఏవేవొ అడిగేసానా నిజమేనా?
నీ నీడలో నేనుండగా నీ అడుగుల వెంటే నేనే కదా
నీ చూపులే నా మనసుని ఆ అడిగేవన్నీ నిజమే కదా
కదిలేనా నీ తలపు లేకుండానె క్షణమైనా క్షణమైనా
ఓ, నిన్నలా లేదే మొన్నలా లేదే
ఈ రోజిలా ఎందుకే?
సననననన సనననన
సననననన సనననన
సననననన సనానసానన
సననననన సనానసానన
కనుతెరిచీ ఏవేవొ చూస్తూ ఉన్నా కనబడదే (కనబడదే)
కనులెదుటా నీ రూపు కదలుతూ ఉంది కల కాదే (కల కాదే)
నీ లోకమై నేనుండగా
నీ చూపుల నిండా నేనే కదా
నా ఊపిరై నువ్వుండగా
నా ఈ ప్రాణం నీవే కదా
కడదాకా ఒక్కటై నిలవాలి ఏమైనా
ఓ, నిన్నలా లేదే మొన్నలా లేదే
ఈ రోజిలా ఎందుకే?
నిన్నిలా నాకే కొత్తగా చూపే
ఈ వేళిలా ఎందుకే?
నువ్విలా నాలో నేనిలా నీలో
లీనమైపోయేందుకే?
నా ఈ గుండె నా అదుపు తప్పి
నా ఈ కనులు నీ వైపు తిప్పి
నా ఈ మనసు నీతోటి కలిపి
నేనే నీలో నిలువెల్ల కలిసి
నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి
మౌనంగానె ఏదేదో తెలిపి
నాలో ఉన్న ప్రాణాలు నలిపి
నేనే నాకు లేకుండ చేసి
(నేనే నాకు లేకుండ చేసి)