00:00
03:54
పిల్లా నీ కోసమే నేను పుట్టినానే
నా కోసమే నువ్వు పుట్టినావే
మన కోసమే లవ్ పుట్టినాదే
అది గుండెల్లో ఉండిపోదే
పిల్లా నీ నవ్వుకి flat అయ్యా
పిల్లా నీ చూపుకి melt అయ్యా
పిల్లా నీ అరుకు లోయలాంటి అందంలో
నే నిలువునా పడిపోయా
అరె నిన్ను సూడగానే నా మనసులోన ఎదో ఎదో అయ్యిందే
ఓ... పిల్లా నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే
అరె నిన్ను సూడగానే నా మనసులోన ఎదో ఎదో అయ్యిందే
♪
ఓ... మట్టి రొడ్డులాంటి లైఫ్ లోకి
తారు రోడ్డు లాగ వచ్చినావే
నూ... రాకపోతే, బతుకు మొత్తం, తారు-మారయ్యేదే
సిగ్నల్స్ అందకుంటే, ఏ flight తీరాన్ని చేరుకోదే
నీ ప్రేమ అందకుంటే, నా జిందగీ ఇట్టాగే నవ్వుకోదే
పిల్లా నా చేతులెత్తి ఏ నాడు
పిల్లా ఏ దేవుడ్ని మొక్కలేదే
పిల్లా అయినా ఆ దేవుడు నిన్ను పంపితే కాళ్ళు పట్టుకున్న తప్పులేదే
అరె నిన్ను సూడగానే నా మనసులోన ఎదో ఎదో అయ్యిందే
ఓ... పిల్లా నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే
అరె నిన్ను సూడగానే నా మనసులోన ఎదో ఎదో అయ్యిందే
♪
ఓ... white పేపర్ అంటి మనసులోన
కలర్ పెన్సిల్ ఎట్టి గీసినావే
నీ... గుర్తులన్నీ, రబ్బర్ ఎట్టి చెరిపినా చెరిగేనా
ఎక్కిళ్లు వస్తుంటే, ఇన్నాళ్ళుగ ఏమేమో అనుకున్నా
అదంత నీ తలపే అనిప్పుడే చిత్రంగ తెలుసుకున్నా
పిల్లా నీ రాకతోటి ఒక్కసారి
పిల్లా నా హార్ట్ డోరు ఓపెన్ అయ్యే
పిల్ల ఇలా వేలు పట్టి చూపిస్తూ నా ప్రేమ నిన్ను చేరుకుందే
అరె నిన్ను సూడగానే నా మనసులోన ఎదో ఎదో అయ్యిందే
ఓ... పిల్లా నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే
అరె నిన్ను సూడగానే నా మనసులోన ఎదో ఎదో అయ్యిందే