background cover of music playing
Masti Masti - Sooraj Santhosh, Shweta Mohan

Masti Masti

Sooraj Santhosh, Shweta Mohan

00:00

03:40

Similar recommendations

Lyric

(मस्ती मस्ती ज़िन्दगी हे मस्ती)

ఏమైంది ఇంతకాలం ఈ సంతోషం

మబ్బుల్లోన దాచిందేమో ఆకాశం

(मस्ती मस्ती ज़िन्दगी हे मस्ती)

దేన్నైనా అందుకునే నిన్ను చూసి

నీకిచ్చి పంపిందేమో ఈ నిమిషం

(मस्ती मस्ती ज़िन्दगी हे मस्ती)

నాదేముంది నీవల్లే ఆనందం పోగేస్తున్న

నీతో వున్న క్షణములోన

నువ్విచ్చింది మళ్ళీ నీకే ఇస్తున్నా

मस्ती मस्ती ज़िन्दगी हे मस्ती

నువ్వు తోడు ఉంటె చాలు హాయితోనే దోస్తీ

मस्ती मस्ती ज़िन्दगी हे मस्ती

నువ్వుతోడు ఉంటె చాలు సంబరాల ఆస్తి

వారే వారే ఎలా వయసుకింద ఇలా

చక్కేరాలు పెట్టింది ఊహ

నువ్వు తోడుగుంటే ఎంత దూరమంటే

అంత దూరమెళ్ళంది రా

రెండు పక్కలకి రెండు రెక్కలొచ్చి

రేచ్చిపోయి రివ్వంది ఆశ

నిన్ను చూసుకుని నిన్న మొన్నలని

మర్చిపోయి తుళ్ళింది తెలుసా

నీ చుట్టూర నా ప్రాణం ఉల్లాసంగా తుళ్ళిందే

నీ ప్రాణాన్ని చుట్టేసే ఊపిరిలోన దాచుకోవాలని వుందే

मस्ती मस्ती ज़िन्दगी हे मस्ती

నువ్వు తోడు వుంటే చాలు హాయితోనే దోస్తీ

గంటలయ్యే కొద్ది తగ్గిపోతువుంది

నీకు నాకు మధ్యున్న ఖాళీ

దగ్గరయ్యే కొద్ది పొంగిపోతూవుంది

నిన్ను నన్ను తాకేటి గాలి

ఉన్న చోట ఉన్న రంగు చల్లుకున్నా

జీవితంలో కొస్తుంది హోలీ

నిన్ను చూస్తూ ఉంటే రెండు కళ్ళల్లోన

చిమ్మ చీకటైన దీపావళి

నీ మాటైన మంత్రంలా

నా గుండెల్లో మొగిందే

ఏ మంత్రంలో మాటైన

నీ పేరు కంటే తక్కువగా తోచిందే

मस्ती मस्ती ज़िन्दगी हे मस्ती

నువ్వు తోడు వుంటే చాలు హాయితోనే దోస్తీ

मस्ती मस्ती ज़िन्दगी हे मस्ती

నువ్వుతోడు వుంటే చాలు సంబరాల ఆస్తి

- It's already the end -