background cover of music playing
Urumulu Nimuvvalai - Rajesh

Urumulu Nimuvvalai

Rajesh

00:00

04:31

Similar recommendations

Lyric

ఉరుములు ని మువ్వలై మెరుపులు ని నవ్వులే

తొలకరి మేగానివై రా అలివేణి

పరుగులు ని గానమై తరంగాలు ని తాళమై

చిలిపిగా చిందాడవే కిన్నెరసాని

కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళా

అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నెల

తకధిమి తాళాలపై తళుకుల తరంగమై

చిలిపిగా చిందాడవే కిన్నెరసాని

మెలికల మందాకిని కులుకుల బృందావని

కనులకు విండియ్యవే ఆ అందాన్ని

చంద్రుల్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి

చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతిపూటా దీపావళి

మా కళ్ళల్లో వెలిగించవే సిరివెన్నెల

మా ఆశలే ని అందేలై ఈ మంచు మౌనం మోగే వేళా

ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళా

ఉరుములు ని మువ్వలై మెరుపులు ని నవ్వులే

తొలకరి మేగానివై రా కళ్యాణి

తకధిమి తాళాలపై తళుకుల తరంగమై

చిలిపిగా చిందాడవే కిన్నెరసాని

నడయాడే ని పాదం నాటవేదమేనంటూ ఈ పుడమి పులకించగా

ని పెదవే తన కోసం అనువైన కొలువంతు సంగీతం నిను చేరగా

మా గుండెనే శృతి చేయవా ని వీణలా

ఈ గాలిలో ని కేళితో రాగాలు ఎన్నో రేగే వేళా

ని మేనిలో హరివిల్లునే వర్ణాల వానై సాగే వేళా

ఉరుములు ని మువ్వలై మెరుపులు ని నవ్వులే

తొలకరి మేగానివై రా అలివేణి

తకధిమి తాళాలపై తళుకుల తరంగమై

చిలిపిగా చిందాడవే

- It's already the end -