background cover of music playing
Manasu Palike - S. P. Balasubrahmanyam

Manasu Palike

S. P. Balasubrahmanyam

00:00

05:33

Similar recommendations

Lyric

మనసు పలికే... మనసు పలికే

మౌనగీతం... మౌనగీతం

మనసు పలికే మౌనగీతం నేడే

మమతలొలికే... మమతలొలికే

స్వాతిముత్యం... స్వాతిముత్యం

మమతలొలికే స్వాతిముత్యం నీవే

అణువు అణువు ప్రణయమధువు

అణువు అణువు ప్రణయమధువు

తనువు సుమ ధనువు

మనసు పలికే మౌనగీతం నేడే

మమతలొలికే స్వాతిముత్యం నీవే

శిరసుపై నీ గంగనై మరుల జలకాలాడనీ

మరుల జలకాలాడనీ

సగము మేన గిరిజనై పగలు రేయీ ఒదగనీ

పగలు రేయీ ఒదగనీ

హృదయ మేళనలో మధురలాలనలో

హృదయ మేళనలో మధురలాలనలో

వెలిగిపోనీ రాగదీపం

వెలిగిపోనీ రాగదీపం వేయి జన్మలుగా

మనసు పలికే మౌనగీతం నేడే

మమతలొలికే స్వాతిముత్యం నీవే

కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ

ఓనమాలు దిద్దనీ

పెదవిపై నీ ముద్దునై మొదటి తీపి అద్దనీ

మొదటి తీపి

లలితయామినిలో కలల కౌముదిలో

లలితయామినిలో కలల కౌముదిలో

కరిగిపోనీ కాలమంతా

కరిగిపోనీ కాలమంతా కౌగిలింతలుగా

మనసు పలికే... మనసు పలికే

మౌనగీతం... మౌనగీతం

మనసు పలికే మౌనగీతం నేడే

మమతలొలికే... మమతలొలికే

స్వాతిముత్యం... స్వాతిముత్యం

మమతలొలికే స్వాతిముత్యం నీవే

అణువు అణువు ప్రణయమధువు

అణువు అణువు ప్రణయమధువు

తనువు సుమ ధనువు

- It's already the end -