background cover of music playing
Vasantham La - S. P. Balasubrahmanyam

Vasantham La

S. P. Balasubrahmanyam

00:00

05:01

Similar recommendations

Lyric

వసంతంలా వచ్చిపోవా ఇలా, నిరీక్షించే కంటికే పాపలా

కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన తొలకరి పాటల సొగసరి కోయిలలా

వసంతంలా వచ్చిపోవా ఇలా, నిరీక్షించే కంటికే పాపలా

హాయిలా మురళి కోయిల అరకులోయల పలుకగా

వేణువై తనువు గానమై మనసు రాధనై పెదవి కలిపాలే

మదిలో మధురాపురి ఉన్నది తెలుసా మనసా

నడిచే బృందావని నీవని తెలిసే కలిశా

పూటా ఒక పాట తొలి వలపుల పిలుపుల శృతులు తెలుసుకోవా

వసంతంలా వచ్చిపోవా ఇలా, నిరీక్షించే కంటికే పాపలా

మౌనమో ప్రణయగానమో మనసు దానమో తెలుసుకో

నీవులో కలిసి నేనుగా అలసి తోడుగా పిలిచి వలచాలే

శిలలే చిగురించిన శిల్పం చెలిగా పిలిచే

కనులే పండించిన స్వప్నం నిజమై నిలిచే

నేడో మరునాడో మన మమతల చరితల మలుపు తెలుసుకోవా

వసంతంలా వచ్చిపోవా ఇలా, నిరీక్షించే కంటికే పాపలా

కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన తొలకరి పాటల సొగసరి కోయిలలా

వసంతంలా వచ్చిపోవా ఇలా

- It's already the end -