background cover of music playing
Ninu Choosthunte - Siddharth

Ninu Choosthunte

Siddharth

00:00

05:11

Similar recommendations

Lyric

హే నిను చూస్తుంటే చెడి పోతానే

తప్పనుకోవు కదా

పొగిడావంటే పడిపోతానే

తప్పని గొడవ కదా

పదా పద అంటోందే హాయ్

పదే పదే నీ అందం

అహా మహా బాగుందే హాయ్

మతే చెడే ఆనందం

ఉరకలెత్తే యవ్వనం తరుముతుంటే కాదనం

సనం ఓ సనం సనం ఓ సనం

హే నిను చూస్తుంటే చెడి పోతానే

తప్పనుకోవు కదా

పొగిడావంటే పడిపోతానే

తప్పని గొడవ కదా

తీగ నడుము కద తూగి తడబడద

రేకు విరిసిన సోకు

బరువుకు సాయపడమనదా

ఆడ మనసు కద బైట పడగలద

అంత సులువుగ అంతు దొరకదు

వింత పొడుపు కధా

కబురు పంపిన పై యదా

ఇపుడు వెయ్యకు వాయిదా

సనం ఓ సనం సనం ఓ సనం హ

హే నిను చూస్తుంటే చెడి పోతానే

తప్పనుకోవు కదా

హా పొగిడావంటే పడిపోతానే

తప్పని గొడవ కదా

లేడి కన్నులతో వగలాడి వన్నెలతో

కంటపడి మహ కొంటెగా

కవ్వించు తుంటరివో

వాడి తపనలతో మగవాడి తహ తహతో

జంట పడమని వెంటపడి

వేధించు తొందరవో

పెదవి అంచున ఆగిన

అసలు సంగతి దాగున

సనం ఓ సనం సనం ఓ సనం

హే నిను చూస్తుంటే చెడి పోతానే

తప్పనుకోవు కదా

పొగిడావంటే పడిపోతానే

తప్పని గొడవ కదా

- It's already the end -