00:00
05:05
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి సంగతి
బైటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి
బిడియం ఆపేదెలా
ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి
తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి ఎద గోడవేమిటో
తెలపకపోతె ఎలా
మనసున ఉన్నది చెప్పాలని వున్నది
మాటలు రావే ఎలా
చింత నిప్పాయిన చల్లగా ఉందని
ఎంత నొప్పాయిన తెలియలేదని
తననే తలచుకునె వేడిలో
ప్రేమ ఆంటేనే తీయని బాధని
లేత గుండెల్లో కొండంత బరువని
కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతుంద నా ప్రియమైన నీకు
నా యద కోత అని అడగాలని
అనుకుంటూ తన చుట్టూ
మరి తిరిగిందని
తెలపక పోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
నేను కన్నుల్లో అతని బొమ్మని
చూసి నాకింకా చోటిక్కడ ఉందని
నిదరే కోసురుకొనే రేయిలో
మేలుకున్నాయి ఇదేం వింత కైపని
వేల ఊహల్లో ఊరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైన నీకు
ఆశల రాగం అని అడగాలని
పగలేదో రేయేదో గురుతే లేదని
తెలపక పోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి సంగతి
బైటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి
బిడియం ఆపేదెలా
ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి ఎద గోడవేమిటో
తెలిపకపోతే ఎలా