background cover of music playing
Rayini Maatram - Himesh Reshammiya

Rayini Maatram

Himesh Reshammiya

00:00

05:28

Similar recommendations

Lyric

ఓం

నమో నారాయణాయ

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు

దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు

దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

హరిని తలచు నా హృదయం

నేడు హరుని తలచుట జరగదులే

అష్ట అక్షరం తెలిసిన నోరు

పంచ అక్షరం పలకదులే

వంకర కన్నుల మీరు శంకర కింకరులు

వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులు

నిలువు నామం దాల్చు తలను

మీకు వంచనులే

నిలువునా నను చీల్చుతున్నా

మాట మార్చనులే

నిలువు నామం దాల్చు తలను

మీకు వంచనులే

నిలువునా నువు చీల్చుతున్నా

మాట మార్చనులే

వీర శైవుల బెదిరింపులకు

పరమ వైష్ణవం ఆగదులే

ప్రభువు ఆనతికి జడిసే నాడు

పడమట సూర్యుడు పొడవడులే

రాజ్య లక్ష్మి నాధుడు శ్రీనివాసుడే

శ్రీనీవాసుడి వారసుడీ విష్ణు దాసుడే

దేశాన్నేలే వారంతా రాజ్య రాసులే

రాచలకు రాజు ఈ రంగరాజననే

నీటిలోన ముంచినంత నీతి చావదులే

గుండెలోన వెలుగును నింపే

జ్యోతి ఆరదులే

నీటిలోన ముంచినంత నీతి చావదులే

గుండెలోన వెలుగును నింపే

జ్యోతి ఆరదులే

దివ్వెలనార్పే సుడిగాలి

వెన్నెల వెలుగును ఆర్పేనా

నేలను ముంచే జడివాన

ఆకాశాన్నే తడిపేనా

శైవం ఒక్కటే మాత్రం దైవం కాదంట

దైవం కోసం పోరే సమయం లేదంట

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు

దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

- It's already the end -