00:00
04:20
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే...
♪
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
ఒడి చేరి ఒకటైపోయే
ఒడి చేరి ఒకటైపోయే
తీరం కోరే ప్రాయం
విరహం పొంగెలే
హృదయం ఊగెలే
అధరం అంచులే
మధురం కోరెలే
అంతేలేని ఏదో తాపం ఏమిటిలా
నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా
చెంతచేరి సేదతీరే ప్రాయమిలా
చెయ్యిచాచి కోరుతుంది సాయమిలా
కాలాలు మారినా
నీ ధ్యాస మారునా
అడిగింది మోహమే
నీ తోడు ఇలా ఇలా...
విరహం పొంగెలే
హృదయం ఊగెలే
అధరం అంచులే
మధురం కోరెలే
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే...
♪
నిన్నే నిన్నే కన్నులలో
దాచానులే లోకముగా
నన్నే నన్నే మలిచానే నీవుగా...
బుగ్గ మీద ముద్దే పెట్టే చిలిపితనం
ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగుణం
పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో
నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో
నీలోన చేరగా
నానుంచి వేరుగా
కదిలింది ప్రాణమే
నీవైపు ఇలా ఇలా...