00:00
04:44
చిరు చిరు చిరు చినుకై కురిశావే
మరు క్షణమున మరుగైపోయావే
నువ్వే ప్రేమబాణం
నువ్వే ప్రేమకోణం
పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం
(చెయ్ చెయ్) చెలిమిని చెయ్
అంటూ హృదయం పలికినదే
(సై సై) సరసకు సై
అంటూ పాదం కదిలినదే
ఎదనే నీతో ఎత్తుకెళ్ళావే
చిరు చిరు చిరు చినుకై కురిశావే
మరు క్షణమున మరుగైపోయావే
♪
దేవత తనే ఒక దేవత
ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా
గాలిలో తనే కదా పరిమళం
చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా
సిగలో కురులే మేఘాలల్లే ఆడే వేళ
గుండెల్లోన మెరుపే మెరిసే, చూపే మైమరచే
చెలి చెక్కిల్లే ముద్దుల్తోనే తడిమెయ్యాల
చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే
ఎదనే తనతో ఎత్తుకెళ్లిందే
(చెయ్ చెయ్) చెలిమిని చెయ్
అంటూ హృదయం పలికినదే
(సై సై) సరసకు సై
అంటూ పాదం కదిలినదే
♪
తోడుగా ప్రతిక్షణం వీడక
అనుక్షణం ఆమెతో సాగనా, ఆమె నా స్పందన
నేలపై పడేయక నీడనే
చక చక చేరనా, ఆపనా, గుండెలో చేర్చనా
దారం బదులు ప్రాయంతోటే కట్టేసిందే
గాయం లేక కోసేసిందే, హాయిగ నవ్వేసిందే
నాలో నేను మౌనంగానే మాటాడేస్తే
మొత్తం తాను వింటూ ఉందే, తియ్యగ వేదిస్తుందే
ఎదనే తనతో ఎత్తుకెళ్లిందే
(చెయ్ చెయ్) చెలిమిని చెయ్
అంటూ హృదయం పలికినదే
(సై సై) సరసకు సై
అంటూ పాదం కదిలినదే
♪
చిరు చిరు చిరు చినుకై కురిశావే
మరు క్షణమున మరుగైపోయావే
చిరు చిరు చిరు చినుకై కురిశావే
మరు క్షణమున మరుగైపోయావే